తెలంగాణలో సబ్బండవర్గాలకు సంపూర్ణ న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ మాడల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. అణగారిన వర్గాలకు కేసీఆర్ పాలన వరంగా మారింది. ఉద్యమనాయకుడిగా లంబాడీ తండాలు, గోండు గూడే ల్లో స్వయంగా తిరిగి వారి బాగోగులు తెలుసుకున్నారు సీఎం కేసీఆర్. ఆ వర్గాలకు ఎలాంటి కష్టాలు ఉండొద్దని, వారి జీవితాల్లో వెలుగులు చూడాలనే విశాల దృక్పథంతో పాలన చేస్తున్నారు. అనేక ఏండ్లుగా పట్టాల కోసం ఎదురు చూస్తున్న గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఈరోజు రాష్ట్రంలోని పోడు రైతులందరికీ సీఎం కేసీఆర్ పట్టాలు ఇవ్వనున్నారు. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ అధికారం చేపట్టగానే గిరిజన తండాల ను గ్రామ పంచాయతీలుగా మార్చి చరిత్రలో నిలిచి పోయారు. ఇక జనాభా దామాషా ప్రకారం గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచారు. ఇప్పుడు గిరిజనులు సాగుచేస్తున్న భూములకు పట్టాలిచ్చి వారికి అభివృద్ధి బాట చూపుతున్నారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత గిరిజన సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.53 వేల కోట్లు ఖర్చు చేసింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో గిరిజనుల కోసం నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. మా తండా, మా గూడెం, మా రాజ్యం..అనేది ఆదివాసీల ఆకాంక్ష. దాన్ని సీఎం కేసీఆర్ నెరవేర్చారు. గిరిజన తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. రాష్ట్రంలో 3146 గ్రామ పంచాయతీలకు గిరిజనులే సర్పంచులుగా ఉండటం గర్వించదగ్గ సందర్భం.గిరిజన గ్రామాల్లో రూ.243.20 కోట్లతో గ్రామపంచాయతీ భవనాలు నిర్మించారు. ఇప్పటివరకు రూ.1275 .87 కోట్లతో 1682 గిరిజన ఆవాసాలకు బీటీ రోడ్లు నిర్మించింది ప్రభుత్వం. రూ.121.86 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 58 గిరిజన భవనాలు నిర్మించింది. హైదరాబాద్ నడి బొడ్డున కుమ్రంభీం, సంత్ సేవాలాల్ భవనాలు నిర్మించింది. 3467 గిరిజన ప్రాంతాలకు రూ.221 కోట్లతో వ్యవసాయ విద్యుత్తు సౌకర్యం కల్పించింది. 92 ప్రత్యేక ఎస్టీ గురుకులాలు ఏర్పా టు చేసింది. జనాభా దామాషా ప్రకారం ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతానికి పెంచడం ద్వారా విద్య, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి.
మద్యం షాపుల లైసెన్సుల్లో 5 శాతం గిరిజనులకు రిజర్వేషన్ కల్పించారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 1.55 లక్షల మందికి రూ. 1306 .25 కోట్ల ఆర్థిక సహాయం అందింది. 8.2 లక్షల మంది గిరిజన రైతులు రైతుబంధు ద్వారా రూ.8305 .40 కోట్లు అందుకున్నారు. గిరిజనుల విద్య, వైద్యం, వారి సంస్కృతి పరిరక్షణ కోసం కూ డా తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది. గిరిజనుల పండుగలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.356 కోట్ల రూపాయలను ఖర్చు చేసి మేడారంలో మౌలిక సదుపాయాలు కల్పించారు. సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ షిప్ పథకం ద్వారా ఇప్పటి వరకు 109 మంది ఔత్సాహిక గిరిజన పారిశ్రామికవేత్తలకు రూ 44.51 కోట్ల ఆర్థిక సాయం అందించింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం గిరి వికాసం, డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం ద్వారా గిరిజన యువతకు లబ్ధి చేకూర్చింది. ఇక గిరిజన గ్రామాలు, ఆదివాసీ గూడేలు, తండాలకు రవాణా మౌలిక సౌకర్యాల కల్పనను కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. తెలంగాణలోని అన్ని గిరిజన ఆవాసాలకు విద్యుత్తు సౌకర్యం కల్పిస్తున్నారు.
ఇక దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న పోడు భూములకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపుతున్నారు. ఈ పక్రియ జల్.. జంగల్.. జమీన్ అని నినదించిన గోండువీరుడు కుమ్రంభీం పుట్టిన గడ్డ ఆసిఫాబాద్ జిల్లా నుంచే ప్రారంభం కానున్నది. పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఫారెస్ట్ కమిటీలను వేసి అర్హులైన పోడు రైతులను గుర్తించింది. రాష్ట్రవ్యాప్తం గా 28 జిల్లాలు, 295 మండలాలు, 2,845 గ్రామపంచాయతీల పరిధిలో ఈ ఫారెస్ట్ రైట్ కమిటీలు క్షేత్ర స్థాయిలో పరిశీలించాయి. రాష్ట్రంలోని 12,49, 296 ఎకరాలకు సంబంధించి 4,14,353 క్లెయిమ్స్‌ను ఫారెస్ట్ కమిటీలు వివిధ స్థాయిల్లో పరిశీలించిన అనంతరం 28 జిల్లాల పరిధిలో 4,06, 369 ఎకరాలకు సంబంధించి 1,51,146 మంది లబ్ధిదారులు పోడు పట్టాలు పొందేందుకు అర్హులు అని సర్కారు గుర్తించింది.
భూ యాజమాన్య హక్కు పత్రాలు స్వీకరించే గిరిజన రైతులకు సర్కారు ఈ వానాకాలం సీజన్ నుంచే రైతుబంధును కూడా అందించనున్నది. ప్రజల సంక్షేమం కోసం ఏమైనా చేసే లక్ష్యం ఉన్న నాయకుడు దేశంలో కేసీఆర్ మాత్రమేనని అనేక సందర్భాల్లో రుజువైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గా ల సంక్షేమమే దేశ సమృద్ధి, అభివృద్ధిగా భావించి, సీఎం కేసీఆర్ దేశంలో సంచలనాన్ని సృష్టించనున్నారు. బీఆర్ఎస్ మిషన్‌తో భారతదేశంలో మరో సువర్ణాధ్యాయం ప్రారంభంకానున్నది.
(వ్యాసకర్త : లోక్‌సభ సభ్యురాలు, మహబూబాబాద్)
రాష్ట్రవ్యాప్తం గా 28 జిల్లాలు, 295 మండలాలు, 2,845 గ్రామపంచాయతీల పరిధిలో ఫారెస్ట్ రైట్ కమిటీలు క్షేత్ర స్థాయిలో పరిశీలించాయి. రాష్ట్రంలోని 12,49, 296 ఎకరాలకు సంబంధించి 4,14,353 క్లెయిమ్స్‌ను ఫారెస్ట్ కమిటీలు వివిధ స్థాయిలో పరిశీలించాయి. 28 జిల్లాల పరిధిలో 4,06, 369 ఎకరాలకు సంబంధించి 1,51,146 మంది లబ్ధిదారులు పోడు పట్టాలు పొందేందుకు అర్హులు అని సర్కారు గుర్తించింది. భూ యాజమాన్య హక్కు పత్రాలు స్వీకరించే గిరిజన రైతులకు సర్కారు ఈ వానాకాలం సీజన్ నుంచే రైతుబంధును కూడా అందించనున్నది.