శతాబ్దాలుగా వివక్షకు గురవుతూ సరైన విద్యావకాశాలు లేకపోవడంతో వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా రాణించలేకపోయాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే 85 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ. మైనారిటీల జీవితాలు బాగుపడుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పేవారు. వీళ్లు చేసిన త్యాగాలు వెలకట్టలేనివి. అందుకే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ వర్గాల ప్రజల వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. సబ్బండవర్ణాల సంబురాలు.
శతాబ్దాలుగా వివక్షకు గురవుతూ సరైన విద్యావకాశాలు లేకపోవడంతో వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా రాణించలేకపోయాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే 85 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ. మైనారిటీల జీవితాలు బాగుపడుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పేవారు. వీళ్లు చేసిన త్యాగాలు వెలకట్టలేనివి. అందుకే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ వర్గాల ప్రజల వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయడానికి కాళేశ్వరం, పాలమూ రు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు నిర్మించా రు. మిషన్ కాకతీయ ద్వారా వ్యవసాయం వృద్ధిలోకి వస్తే వ్యవసాయంపై ఆధారపడ్డ బీసీ కులా ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయన్నది కేసీఆర్ నమ్మకం. అలాగే ఈ వర్గాల బిడ్డలను విద్యలో ముందడుగు వేయించాలని బీసీ గురుకులాలను ఏర్పాటుచేశారు. వారిలో ఒక్క తరా నికి విద్యనందిస్తే చాలు మిగతా తరాలు తమకు తాము గానే వృద్ధిలోకి వస్తాయన్నది ముఖ్యమంత్రి విశ్వాసం. అందుకే గతంలో ఉన్న 19 బీసీ గురుకులాలను 294కు పెంచారు. 142 గురుకుల జూనియర్ కళాశాలలు, 14 డిగ్రీ గురుకుల కళాశాలలు, రెండు వ్యవసాయ డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేశారు.
తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 1,65, 160 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తూ నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నారు. ఇంకా కంప్యూటర్ శిక్షణ, వ్యక్తిత్వ వికాసం, స్కిల్ డెవలప్మెంట్లో పూర్తిస్థాయిలో విద్యాబోధన కొనసాగుతున్నది. భవిష్యత్తులో వీరంతా తెలంగాణ రాష్ట్ర సంపదగా పరిగణించబడుతారని కేసీఆర్ నమ్ముతున్నారు. వీరు బాగా చదివి దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐ టీ, నీట్, ట్రిపుల్ ఐటీలలో సీట్లు సంపాదించాలన్నది ఆయన కోరిక. ప్రభుత్వ సాంకేతిక విశ్వవిద్యాలయాలు, మెడికల్ కాలేజీల్లో చదివి గొప్పగొప్ప ఉద్యోగాలు సంపాదించి వారి కుటుంబాలు, కులాలు, సమాజంలో గౌరవప్రదంగా బతుకాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం.
ఆర్థిక కారణాలతో బీసీ విద్యార్థులు విద్యకు దూరం కాకూడదని ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివిన విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 స్టడీ సర్కిళ్లు, 35 స్టడీ సెంటర్లు, ఆన్లైన్ కోచింగ్, టీవీ ఛానళ్ల ద్వారా 25 వేల మంది బీసీ విద్యార్థులకు ఉచితంగా గ్రూప్-1,2,3,4 కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగార్థులకు శిక్షణను ఇస్తున్నా రు. వరంగల్, హైదరాబాద్ సెంటర్లలో 200 మందికి సివిల్స్ కోచింగ్ ఇప్పించి వారి జీవితాలను సమూలంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వా త లక్షా ముప్పై వేల పై చిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేశారు. అందులో 25 శాతం బీసీ రిజర్వేషన్‌తో 32,500 మంది బీసీ విద్యార్థు లు ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడ్డారు.
రాబోయే రోజుల్లో మరో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాల్లో 25 శాతం బీసీ రిజర్వేషన్ ద్వారా మరో 17,500 మందికి ఉద్యోగా లు రానున్నాయి. రూ.5 లక్షల లోపు సంవత్సర ఆదాయం ఉన్న బీసీ విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకుగాను మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇప్పటికే 1,630 మందికి సాయం జేసి వారి జీవితానికి భరోసా కల్పించారు. వారంతా ఉన్నతంగా ఎదిగి ఉద్యోగాలు పొందితే వారి కొనుగోలుశక్తి పెరుగుతుందని తద్వారా ప్రభుత్వాని కి ఆదాయం వస్తుందని, దాన్ని తిరిగి సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలన్న దూరదృష్టి కేసీఆర్‌ది. అదేవిధంగా రాష్ట్రంలోని సెలూన్ షాపులకు, లాండ్రీలకు, దోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారు. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ, గొల్లకుర్మలకు గొర్ల పం పిణీ చేస్తూ వారిని ఆదుకుంటున్నారు. అలాగే 42 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారు.
తెలంగాణప్రభుత్వం 10,148 చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేసింది.
నేత కార్మికుల సంక్షేమం కోసం 50 శాతం సబ్సిడీపై నూ లు రసాయనాలు, ఐదు లక్షల మందికి ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించి వారిని ఆదుకున్నది.
ప్రభుత్వం 10,148 చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేసింది. నేత కార్మికుల సంక్షేమం కోసం 50 శాతం సబ్సిడీపై నూలు రసాయనాలు, ఐదు లక్షల మందికి ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించి వారిని ఆదుకున్నది. గీత కార్మికులు మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని రూ.2 లక్షల నుం చి రూ.5 లక్షలకు పెంచారు. ప్రమాదవశాత్తు అంగవైకల్యానికి గురైతే వర్తించే పరిహారాన్ని రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు పెంచారు. రాజధానిలో కల్లు డిపోలు పునరుద్ధరణ, గౌడ సోదరులకు మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేష న్లు కల్పిస్తూ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. తద్వారా 3,893 మద్యం దుకాణాలు రాష్ట్రంలోని గౌడ సోదరులకు దక్కాయి. ప్రత్యేక నీరా పాలసీని తీసుకువచ్చి నీరా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది.
ఎంబీసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయించి చిన్న కులాలకు ఒక్కొక్కరికి 50 వేల రూపాయల చొప్పున లోన్లు ఇచ్చి ఆదుకుంటున్నది. సంచార జాతుల ఎంబీసీ పిల్లలకు గురుకుల పాఠశాలలో క్యాస్ట్ సర్టిఫికెట్ లేకుండానే అడ్మిషన్లు కల్పిస్తూ వారికి విద్యనందిస్తున్నది. ఫెడరేషన్. కార్పొరేషన్లను పునరుద్ధరించి వాటి ద్వారా మిగతా కులాలను ఆదుకోవడానికి రూపకల్పన జరుగుతున్నది. ఇవేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, రైతుబంధు, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్లు బాలామృతం, కంటి వెలుగు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇలా.. అన్ని పథకాలు బలహీన వర్గాలకు అందుతున్నాయి
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భారత ప్రధానిని కలిసి విన్నవించారు. దామాషా పద్ధతిలో బీసీల రిజర్వేషన్లను పెంచాలని, కులగణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ. రాష్ట్రంలో బీసీ ఎంబీసీలకు మార్కెట్ కమిటీ వంటి నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్ కల్పించి వారిని రాజకీయంగా ప్రోత్సహిస్తున్నది. ఈ విధంగా బడుగుల ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతుల్లో అభివృద్ధిని కాంక్షి స్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగుల ఆశాజ్యోతిగా నిలుస్తున్నారు.
(వ్యాసకర్త: బీసీ కమిషన్ సభ్యులు)
– సీహెచ్ ఉపేంద్ర 99632 02547