బతుకమ్మ అంటే ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. ఈ పండుగ దసరా వేడుకలో భాగమే. దసరా అనేది హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు, పదవరోజు విజయదశమి కలిపి దసరా అంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి ముందు వచ్చే అమావాస్య ‘మహాలయ అమావాస్య’ అని కూడా అంటారు .ఈ మహాలయ అమావాస్య రోజునే బతుకమ్మ సంబురాలు ప్రారంభమవుతాయి.
గౌరీ అమ్మ వారికి కావాల్సిన తం గేడు, గన్నేరు, మందార, పున్నా గ, రామబాణం, సీతమ్మ జడ, గునుగు, గుమ్మడి మొదలైన పువ్వులతో అందంగా బతుకమ్మ ని అలంకరించి చివరిగా గుమ్మడి పూవును అమర్చి దాని మధ్య భాగంలో పసుపుతో తయారు చేసిన గౌరమ్మను ఉం చాలి. ఇలా పెద్ద సైజు తల్లి బతుకమ్మను పే ర్చి, దానికి తోడు పిల్ల బతుకమ్మ అని ఇంకో చిన్న సైజు బతుకమ్మను పేర్చి మొదట దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం సమర్పించి పూజిస్తారు. సాయంత్రం వేళలో మహిళలందరూ కలిసి దేవాలయ ప్రాంగణంలో కానీ, చెరువు గట్టున కానీ బతుకమ్మలను ఒక దగ్గర ఉంచి అగర్బత్తీలు వెలిగించి ఆట ,పాటలతో గౌరీ దేవిని పూజిస్తారు.
‘ఏమేమి పూవ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ
తంగేడు కాయొప్పునే గౌరమ్మ
గుమ్మాడి సెట్టు మీద ఆట చిలకల్లారా
పాట చిలకల్లారా కలికి చిలకల్లారా
కందుమ్మ గడ్డలు కలవారి మేడలు
అంటూ పువ్వులతో కూడిన పాటలు, తర్వాత కోలాటం తో కూడిన పాటలు, బతుకమ్మ కథ విన్న తర్వాత గౌరమ్మని నీటిలో ఉంచే ముందు గౌరమ్మకు సంబంధించిన పాటతో ముగించి, ఆ పసుపు గౌరమ్మ ని ముత్తయిదువలందరూ మంగళ సూత్రానికి రాసుకుంటారు.
అనగనగా ఒక రాజు ఆ రాజుకు ఏడుగు రు కొడుకులు ఒక్కతే కూతురు. ఆ రాజు అందరికీ పెండ్లిళ్లు చేసి, కూతురిని అత్తగా రింటికి పంపే ముందు, కొడుకులని పిలిచి తాము కాశీకి వెళుతున్నామని వచ్చే వరకు వారి చెల్లిని జాగ్రత్తగా చూసుకోండని చెప్పి వారు కాశీ యాత్రకి బయలుదేరారు, తల్లిదండ్రులు కాశీయాత్రలోఉండగా బతుకమ్మ పండుగ వస్తుంది. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. అప్పుడు ఆ ఆడబిడ్డ తాను కూడా అందరి లాగే పట్టు వస్ర్తా లు , ఆభరణాలు ధరించి వేడుక చేసుకోవాలనే ఆలోచనతో తన పెద్దవదిన దగ్గరకు వెళ్ళి పట్టు వస్ర్తాలు , ఆభరణాలు కావాలని అడుగుతుంది. తాను పనిలో ఉన్నానని, వీ లు కాదనగానే మిగతా వదినల వద్దకు వెళితే వారు కూడా అదే సమాధానమిస్తారు.
చివరిగా తన ఏడవ వదినని అడిగితే , ఆవిడ సరే ఇస్తాను కానీ , ఒక షరతు.. పట్టు చీరకి పసుపు అంట కూడదు , పట్టు రవికకు గం ధం అంట కూడదు, కాళ్ల కడియాలు నొక్కు లు పోకుండా జాగ్రత్తగా ఇవ్వాలి. లేకపోతే నీ నెత్తురు కండ్ల చూస్తాను అని అనగానే సరే అని , వాటిని ధరించి బతుకమ్మ ఆడడానికి వెళుతుంది. అక్కడ ముత్తయిదవులు అంద రు కాళ్ళకు పసుపు, మెడకు గంధం, బిస్తీ గీ యటం తప్పని సరి లేకపోతే గుడ్డి పిల్లలు పుడుతారని చెప్పగానే భయంతో అన్నీ ఆచరిస్తుంది. దీంతో పసుపు, గంధం అంటి కా ళ్ళ కడియాలు నొక్కులు పోతాయి. ఆమె భయంతో తన వదిన పనిలో ఉన్న సమయంలో వెళ్ళి, వదిన ఇచ్చిన ఆభరణాలు, వస్ర్తాలు కొక్కానికి తగిలించి వస్తుంది. కొద్ది సేపటి తర్వాత వాటిని చూసిన వదిన కోపంతో తలకు (వాసన) బట్ట కట్టుకొని పడుకుంటుంది.
ఇంతలో ఆమె భర్త ఇంటికి వచ్చి ఏమిటి ? తలకి వాసన కట్టుకున్నావు అంటే , జరిగిందంతా భర్తకి తెలిపి వారి చెల్లి నెత్తురు తెచ్చి తన నుదుటన పెడితేనే లేస్తా అంటుంది. ఆ అన్నకు మన సు ఒప్పక అడవికి వెళ్ళి ఒక కాకిని చంపి ఆ నెత్తురు తెచ్చి తన భార్య నుదుటన పెడుతాడు. కట్ల కట్ల కడువ తీసుకొని మెట్లబావికి నీళ్ళ కు పోతే అక్కడ అమ్మలక్క లు చూసి, కల వారి కోడలు కాకి నెత్తురు పెట్టుకుంది? అని హేళన చేస్తారు. తిరిగి వాసన కట్టుకుంటుంది. రెండోసారి గద్ద నెత్తురు తెస్తాడు. మళ్లీ అలాగే హేళన చేయగానే గత్యంతరం లేక తన చెల్లిని కత్తితో నరికి నెత్తురు తెచ్చి భార్య నుదుటి పై పెడుతాడు. అది చూసి అమ్మలక్కలు మొన్న కాకి నెత్తురు, నిన్న గద్ద నెత్తురు , ఈ రోజు మనిషి నెత్తురు? అనగానే ఆనందంతో కడువ నిండా నీళ్ళు తీసుకెళ్ళి ఇల్లు అలికి పరువన్నం చేసి పండు గ చేసుకుంటుంది .. ఇదిట్లా ఉండగా అక్కడ చనిపోయిన ఆడపడుచు పొట్ట బావిగా, కండ్లు రామ చిలుకలుగా శరీరం పెద్ద పూల వనంగా మారుతుంది .
కాశీ యాత్ర ముగించుకొని తిరిగి వచ్చిన తల్లిదండ్రులకు బిడ్డ కనపడదు. విషయం కొడుకులను అడగ్గా ఏడవ వదిన జరిగిన విషయం చెపుతుంది. దీంతో వారు తన ఒక్కగానొక్క కూతురు కోసం అదేఅడవిలో తల కిందులుగా శివుని కోసం ఘోరతపస్సు చేస్తారు. వారి తపస్సుకు మెచ్చి శివ పార్వతులు ప్రత్యక్షం కాగా తమ కూతురుని ప్రసాదించమని వేడుకొంటారు. వారు అమ్మాయి ని బతికించి చేతిలో పెడుతారు. అలా పుట్టిన బిడ్డకు బ్రతుకమ్మ అని పేరు పెడుతారు. ఆ పదం వాడుకలో బతుకమ్మగా మారింది.
అలా వచ్చిన బతుకమ్మ పండుగను నేటికీ తెలంగాణ ప్రజలంతా ఆనందంగా జ రుపు కుంటు న్నారు. తొమ్మిది రోజుల పా టు ఆడిపాడిన తర్వాత పోయిరా నా తల్లి పోయిరావమ్మ / పోయి నీ అత్తిం ట బుద్దిగలిగి ఉండు/మళ్లీ ఏడాదికి తిరిగి తోలుక వత్తు. అని సాగనంపుతారు.
(అక్షరయాన్ సౌజన్యంతో)