సొంత వాహనాలు ఉన్నవాళ్లు దీని గురించి బాగానే తెలుసు. ఎందుకంటే.. పెట్రోల్ బంక్‌లకు వెళ్లగానే ఫోన్ మాట్లాడుతున్నా వెంటనే కట్ చేసేస్తారు. ఫోన్‌ను జేబుల్లో పెట్టుకుంటారు. ఒకవేళ ఫోన్ వాడుతున్నా అక్కడి సిబ్బంది ఫోన్ వాడకండి అని చెబుతుంటారు. అసలు.. పెట్రోల్ బంక్‌ల వద్ద సెల్‌ఫోన్స్ ఎందుకు వాడకూడదు. పెట్రోల్, డీజిల్‌కు ఫోన్‌కు సంబంధం ఏంటి.. అనే విషయాలు చాలామందికి తెలియదు.
అయితే.. సోషల్ మీడియాలో పెట్రోల్ బంక్‌ల్లో వాహనాల్లో ఇంధనం నింపుతున్న సమయంలో మంటలు చెలరేగే వీడియోలు చాలానే చూశాం కానీ.. చాలామటుకు వీడియోలలో వాహనాలకు మంటలు ఎలా వ్యాపించాయో స్పష్టంగా తెలియదు.
చాలామంది చెప్పేది ఏంటంటే.. సెల్‌ఫోన్‌ను పెట్రోల్ బంక్‌ల వద్ద వాడితే.. పెట్రోల్ కానీ.. డీజిల్ కానీ నింపే సమయంలో మంటలు చెలరేగుతాయని అంటారు. అయితే.. దాని వెనుక పెద్ద టెక్నాలజీయే ఉంది.
సాధారణంగా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు.. ఫోన్‌కు, దానికి కనెక్ట్ అయి ఉన్న టవర్‌కు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. అప్పుడే అవతలి వారి మాటలు వినిపిస్తాయి. ఇవతల వాళ్లు మాట్లాడే మాటలు అటు వెళ్తాయి. ఈ కమ్యూనికేషన్ కోసం ఫోన్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వెలువడుతుంది. దానికి చాలా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ వల్ల పెట్రోల్‌ను వాహనాల్లో నింపుతున్న సమయంలో పెట్రోల్ ఆవిరికి కూడా నిప్పు పుడుతుందని దాని వల్ల మంటలు ఏర్పడుతాయని చెబుతుంటారు.
అలాగే.. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్.. పెట్రోల్ బంకుల్లో లోహపు వస్తువులను ప్రేరేపించి.. దాని నుంచి స్పార్క్ వచ్చేలా చేస్తుందని.. ఆ స్పార్క్‌కు పెట్రోల్ ఆవిరి తోడైతే.. పెట్రోల్ బంక్ మొత్తం మాడి మసైపోతుందని.. అందుకే పెట్రోల్ బంక్‌లోకి అడుగు పెట్టగానే ఫోన్స్ వాడొద్దని చెబుతుంటారు.
అయితే.. ఇప్పటి వరకు అలా సెల్‌ఫోన్స్ వాడటం వల్లనే పెట్రోల్ బంక్‌లలో మంటలు చెలరేగాయి.. అనే విధంగా ఎటువంటి ఘటనలు అయితే చోటు చేసుకోలేదు కానీ.. అటువంటివి జరగకుండా జాగ్రత్త పడటం కోసమే.. బంక్ సిబ్బంది ఫోన్లు వాడొద్దు అని చెబుతుంటారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!
Married life tips | కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
Mukesh Ambani | స్పోర్ట్స్.. ఆతిథ్యంపై ముకేశ్ అంబానీ క్రేజీ.. అందుకే లండన్ ఎస్టేట్ సొంతం?!
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రదేశాలను మీరెప్పుడైనా చూశారా..?