మొసలి తలపైకి ఎక్కిన కోడి.. చివరికి ఏమైందో తెలుసా?.. వైరల్ వీడియో

హైదరాబాద్: సాధారణంగా జంతువులకు సంబంధించిన హాస్యాస్పదమైన, తమాషా చేష్టలతో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు. అయితే, తాజాగా అలాంటిదే ఒక వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో నెటిజన్లకు నవ్వు తెప్పించడమే కాదు, కాసేపు భయం పుట్టిస్తుంది కూడా. ఇంతకూ ఏంటా వీడీయో అనుకుంటున్నారా..? అయితే చూద్దాం పదండి..
పదంటే పదే సెకన్ల నిడివిగల ఆ వీడియోలో ఒక మొసలి తన దేహాన్నీ మొత్తం నదిలోపలికి ఉంచి, కేవలం తలను మాత్రమే ఒడ్డుకు పెట్టి నిద్రిస్తూ ఉంటుంది. అయితే, మొసలి ఎంత ప్రమాదకరమో తెలియక దాన్ని పడవలా ఉపయోగించుకుని నదిని దాటాలనుకున్నదో, లేదంటే మొసలి సంగతి తెలిసి కూడా దానికి చిక్కకుండా తప్పించుకోగలనన్న ఆత్మవిశ్వాసమో గానీ ఒక కోడి పుంజు దాని తలపైకి ఎక్కింది. అదే సమయంలో మరో మొసలి నది లోపలి నుంచి ఆ కోడి పుంజునే కనిపెడుతూ మెల్లమెల్లగా అటుగా కదులుతూ కనిపిస్తుంది.
అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా రెండు మొసళ్లలో ఏదో ఒక మొసలి కోడి పుంజును మింగడం ఖాయం అనుకుంటారు. కానీ కోడి పుంజు మాత్రం ఏ మొసలి నోట పడకుండా చాకచక్యంగా తప్పించుకుంది. దీపాన్షు కబ్రా అనే అటవీశాఖ అధికారి పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొసళ్ల బారి నుంచి కోడిపుంజు తప్పించుకున్న తీరుపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఆ కోడి పుంజు ఎలా తప్పించుకుందో కింది వీడియోలో మీరూ ఒకసారి చూడండి.
2020 से 2021… फिर 2021 की शुरुआत…. बस ऐसी👇है
— Dipanshu Kabra (@ipskabra) March 26, 2021
😅😅 pic.twitter.com/uqKNYyVROm
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సెప్టెంబర్ 30 వరకు పాత పద్ధతిలోనే ఆటో డెబిట్ సౌకర్యం..!
వైర్లెస్ స్పీకర్, ఫేస్ మసాజర్‌లో దొంగ బంగారం..!
85 శాతం కొత్త కేసులు ఎనిమిది రాష్ట్రాల్లోనే: కేంద్రం
కొవిషీల్డ్ షెల్ఫ్ లైఫ్‌ను 9 నెలలకు పొడిగించిన డీసీజీఐ
అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెనెట్
మాస్క్ కిందికి.. నేను పైకి.. ముంబై పోలీసుల వినూత్న ప్రచారం
శరద్ పవార్ కు శస్ర్త చికిత్స విజయవంతం
60 ఏళ్ల లోపువారికి ఆస్ట్రాజెనికా టీకా నిలిపివేత..
ఆ నాలుగు నగరాల్లో నైట్ కర్ఫ్యూ పొడగింపు..!
మాకు హిందూ ముస్లిం భేదం లేదు: అమిత్ షా
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

