Union Budget | విదేశాల్లో ఉంటున్న భారతీయులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్న్యూస్ చెప్పారు. భారత స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడుల పరిమితి పెంపునకు అవకాశం కల్పించారు. పార్లమెంటులో ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. మౌలిక వసతుల కోసం రూ.12.2లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
వైద్య అనుబంధ నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక పథకం తీసుకొచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. లక్ష ఏహెచ్పీలను ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో దేశీయ జలరవాణాలో ఆధునిక విధానాలు తీసుకొస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్ కోసం బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీ ప్లేన్ తయారీ రంగం కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఎంఎస్ఎంఈల కోసం కార్పొరేట్ మిత్ర కార్యక్రమం తీసుకొస్తున్నామని అన్నారు. సేవారంగంలో విద్య, ఉద్యోగ అవకాశాల వృద్ధికి ప్రత్యేక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.