జర్మనీ : జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో ‘మన తెలుగు అసోసియేషన్ జర్మనీ (మాట)’ వారి ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు తెలుగువారంతా ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరుపుకున్నారు. వేడుకలు మ్యూనిచ్ నగరంలోని శివాలయం బృందం వారు నిర్వహించిన సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అనంతరం పండితులచే పంచాంగ శ్రవణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను వివరించి, ప్రతి ఒక్కరికి ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. మాట ‘మన తెలుగు బడి’ ద్వారా, బాల బాలికలచే నిర్వహించిన ఉగాది నాటక ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పిల్లల కోసం డ్రాయింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
Prithviraj sukumaran | నా కొడుకుని బలి పశువుని చేయోద్దు అంటూ స్టార్ హీరో తల్లి ఆవేదన..
Nagarkurnool | ఊర్కొండలో దారుణం.. దైవదర్శనానికి వచ్చిన యువతిపై సామూహిక లైంగికదాడి