e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home News Huzurabad | వీణ‌వంక‌లో టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ ప్ర‌చారం

Huzurabad | వీణ‌వంక‌లో టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ ప్ర‌చారం

క‌రీంన‌గ‌ర్ : హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక నేప‌థ్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్ర‌చారంలో దూసుకెళ్తోంది. వీణవంక మండ‌లంలో టీఆర్ఎస్ ఇంచార్జి ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య, జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్ సీఎన్ రెడ్డి, అల్ల‌పురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ(హుజూరాబాద్ ఎన్నిక‌ల ఇంచార్జి) స‌భ్యులు న‌ల్ల శివారెడ్డి త‌మ ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా హుజూరాబాద్ ఎన్నిక‌ల ఇంచార్జి న‌ల్ల శివారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్య‌క్షుడు గుర్రాల నాగ‌రాజు ఆదేశాల మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నామ‌ని తెలిపారు. అలాగే టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్‌కు ఊరూరా ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తున్న‌ద‌ని చెప్పారు. తెలంగాణ‌లో జ‌రిగిన అభివృద్ధి ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని, అందుకే ఏ ఎన్నిక వ‌చ్చినా కేసీఆర్‌కే ప్ర‌జలు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో హుజురాబాద్‌, జ‌మ్మికుంట‌లో సౌతాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు, మిగ‌తా కార్యవర్గ సభ్యులు ప్రచారములో పాల్గొననున్నారని న‌ల్ల శివారెడ్డి తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement