హైదరాబాద్ : ప్రముఖ రచయిత్రి, వ్యాఖ్యాత, సంఘ సేవకురాలు రాధిక మంగిపూడికి ‘తెలుగు భాషా దినోత్సవం’ సందర్భంగా అంతర్జాతీయ ‘ప్రవాస తెలుగు పురస్కారం-2021’ దక్కనుంది. దక్షిణాఫ్రికా నుంచి ‘సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ’, ఐరోపా ఖండంలోని నార్వే నుంచి ‘వీధి అరుగు’ సంస్థల సంయుక్త అధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలలోని 75 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో అంతర్జాల వేదికపై ఆగస్టు 28, 29 తేదీలలో రెండు రోజులపాటు తెలుగు భాషా దినోత్సవం వేడుకలు జరగనున్నాయి.
ఈ ‘తెలుగు భాషా దినోత్సవం-2021’ కార్యక్రమంలో భాగంగా..విదేశాలలో నివసిస్తూ తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన 12 మంది తెలుగు వారిని ఎంపిక చేసి ‘ప్రవాస తెలుగు పురస్కారాలు-2021’ అందజేయనున్నారు. కాగా, ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి రాధిక మంగిపూడి ఎంపికయ్యారు.
2020 వరకు సింగపూర్ లో నివసిస్తూ రాధిక సింగపూర్ నుంచి తొలి తెలుగు రచయిత్రిగా రెండు పుస్తకాలను ప్రచురించి ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చోటు సంపాదించుకుంది. ‘గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం’ ఫేస్బుక్ సంస్థ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల గూర్చిన పలు వ్యాసాలను రాశారు.
అలాగే సింగపూర్ లో ఆధ్యాత్మిక సాహిత్య కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా సింగపూర్‌లోని ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సంస్థ ప్రధాన కార్యనిర్వాహక సభ్యురాలిగా అందించిన సేవలకుగాను ఆమెకు ఈ గుర్తింపు లభించింది.
ఈ పురస్కారానికి ఎంపికవడం ఎంతో సంతోషంగా ఉందని రాధిక తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులకు, తనను నిత్యం ప్రోత్సహిస్తున్న‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రపంచ నలుమూలలలోని పలు దేశాల నుంచి ఈ పురస్కారాల కోసం వచ్చిన నామినేషన్లను నిష్ణాతులైన న్యాయనిర్ణేతలు పరిశీలించి 12 మందిని పురస్కారాలకు ఎన్నిక చేశారు.
ఈ పురస్కారాలను ఆగష్టు ??వ తేదీ తెలుగు భాషా దినోత్సవ మొదటి రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథులచే ప్రదానం చేస్తామని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు.
ఈ సందర్భంగా రాధికకు సింగపూర్ నుండి ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, ఇతర సభ్యులు, అన్ని దేశాల నుంచి శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
Cricket : పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
Road accident : రోడ్డు ప్రమాదంలో సాప్ట్వేర్ ఇంజినీర్ మృతి
కన్నేపల్లిలో శతాధిక వృద్ధురాలు మృతి
Job news|న్యూ ఇండియా అస్యూరెన్స్‌లో 300 పోస్టులు