న్యూఢిల్లీ: స్క్రాప్ మెటల్ మాఫియా(Scrap Mafia) నడిపే రవి కానా, అతని గర్ల్‌ఫ్రెండ్ కాజల్ ఝాను థాయిలాండ్‌లో అరెస్టు చేశారు. యూపీలోకి చెందిన గ్యాంగ్‌స్టర్ కానా చాన్నాళ్ల నుంచి పాత ఇనుప సామన్ల దందాలో ఉన్నాడు. నోయిడా పోలీసులు అనేక కేసుల్లో అతని కోసం అన్వేషిస్తున్నారు. కానా కోసం థాయిలాండ్ పోలీసులతో నోయిడా పోలీసులు నిత్యం టచ్‌లో ఉన్నారు. అతనికి చెందిన అన్ని వివరాలను సమర్పించారు. జనవరిలో అతని కోసం రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేశారు.
కఠినమైన యూపీ గ్యాంగ్‌స్టర్ చట్టం కింద రవి కానాను బుక్ చేశారు. అతనిపై గ్రేటర్ నోయిడాలో పోలీసు ఫిర్యాదు నమోదు అయ్యింది. కానాను రవీంద్ర నగర్ అని కూడా పిలుస్తారు. అతనికి 16 మంది సభ్యుల గ్యాంగ్ ఉన్నది. వాళ్లంతా స్క్రాప్ మెటల్ దందా చేస్తుంటారు. స్క్రాప్ డీలర్‌గా కానా చాలా సంపాదించాడు. అతను మిలియనీర్ అయ్యాడు. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతాల్లో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ గ్యాంగ్‌స్టర్‌పై మొత్తం 11 కేసులు రిజిస్టర్ చేశారు. కిడ్నాప్, దొంగతనం కేసులు కూడా ఉన్నాయి.
గ్యాంగ్‌లోని ఆరుగుర్ని ఇప్పటికే అరెస్టు చేశారు. గ్రేటర్ నోయిడాలో ఉన్న పలు స్క్రాప్ గోడౌన్లను సీజ్ చేశారు. కానాతో పాటు అతనికి సంబంధం ఉన్న వ్యక్తులకు చెందిన సుమారు 120 కోట్లను సీజ్ చేశారు. గర్ల్‌ఫ్రెండ్ కాజల్ జాకు సుమారు వంద కోట్ల ఖరీదైన బిల్డింగ్‌ను కానా గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ బిల్డింగ్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఒకప్పుడు ఉద్యోగం కోసం కానా వద్దకు కాజల్ వెళ్లింది. ఆ తర్వాత అతని గ్యాంగ్‌లో సభ్యురాలైంది. కానా బినామీ ఆస్తులకు చెందిన పుస్తకాలను కాజల్ చూసుకునేది.