Mock Assembly | తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించగా.. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు శాసన సభ స్పీకర్‌గా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ సభ్యులు సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి పాత్రలో తలసాని శ్రీనివాస్‌యాదవ్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అశోక్ నగర్లో ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది నేనా అధ్యక్ష..? ఎన్నికల ముందు అశోక్‌నగర్‌లో ఉద్యోగాలు ఇస్తమని చెప్పింది.. మా రాహుల్ గాంధీ చెప్పిండు.. ఆయనను పోయి అడగండి.. అంటూ చురకలంటించారు.
హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకొని నేనేదో నేర్చుకొని మీకేదో నేర్పిద్దాం అంటే మళ్లా నాపాత భాషనే పేగులు మెడలేసుకుంటా అని మొదలు పెట్టాలా..? ఏరోస్పేస్..విమానం ఎక్కడ తయారైతది అని అంటే దిల్ సుఖ్‌నగర్.. మరి కాకపోతే ఎక్కడ అయితది.. మీ ఇంటికాడా అయితదా..? మీ కోరుట్లలో అయితదా..? కాబట్టి నాకున్న పరిజ్ఞానంతోని మావాళ్లు చెప్పిన అంశాలనే నేను చెబుతున్నాన్నారు తలసాని.
అశోక్ నగర్లో ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది నేనా అధ్యక్ష?
రాహుల్ గాంధీ చెప్పిండు.. పోయి ఆయనను అడగండి
– మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అలియాస్ తలసాని శ్రీనివాస్ యాదవ్ https://t.co/0Tu9F2kb73 pic.twitter.com/wyhIPUGZPp
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2026
మళ్లీ నా పాత భాష మొదలు పెట్టమంటారా?
హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకొని వచ్చి మీకు నేర్పిద్దాం అనుకున్నా
పేగులు తీసి మెడల వేసుకొని అని మళ్లీ నా పాత భాషను మొదలు పెట్టాలా?
విమానం దిల్‌సుఖ్‌నగర్‌లో తయారు కాకపోతే మీ ఇంట్లో కోరుట్లలో అవుతదా?
నాకున్న పరిజ్ఞానంతో మా వాళ్లు చెప్పింది… https://t.co/V9SkDl2nwp pic.twitter.com/WyNnQRKe2G
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2026
Brahmotsavams | ఏపీ సీఎంకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత