అమరావతి : ఏపీ వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి , శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana ) మరోసారి కంటతడి ( Weeps Again ) పెట్టుకున్నారు. మూడు రోజుల్లో రెండుసార్లు భావోద్వేగానికి గురై కన్నీరు కార్చారు. విజయనగరం జిల్లా వైసీపీ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది.
ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ జిల్లాలో బొత్స సత్యనారాయణ సేవలను కొనియాడుతూనే ఆయన కుటుంబ సభ్యుడు మేనల్లుడు, జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను వెన్నుపోటు పోడిచారని ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన బొత్స కంటతడి పెట్టుకోవడం అక్కడివారిని కలిచి వేసింది.
గత మూడు రోజుల క్రితం గిరివిడి మండలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై , తన మేనల్లుడు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కంటతడిపెట్టుకున్నారు. మరోసారి శనివారం జరిగిన సమావేశంలో బొత్స మాట్లాడుతూ నమ్మినవారే తనను మోసం చేశారని వాపోయారు.
వెన్నుపోటు పార్టీ అరాచకాలు ప్రజలకు తెలియజేయాలని వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని పేర్కొన్నా రు. తనను పిలిచినా వెళ్లకుండా విలువల కోసం వైసీపీలో ఉన్నానని స్పష్టం చేశారు. మూడు నెలల క్రితం కూడా వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని తలుచుకుని ఆయన కన్నీరుకార్చారు.