Forex reserves | విదేశీ మారక నిల్వల్లో భారత్ రికార్డు.. రష్యాను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో స్థానానికి..!
Forex reserves | భారతదేశ ఆర్థికవ్యవస్థ (Indian Economy) మరో కీలక మైలురాయిని అందుకుంది. ఆర్బీఐ (RBI) చేపట్టిన ప్రత్యేక పథకం కారణంగా దేశంలోకి డాలర్ల ప్రవాహం (Dallors flow) రికార్డు స్థాయిలో పెరగడంతో విదేశీ మారక నిల్వలు (Forex reserves) ఆల్-టైమ్ గరిష్ఠానికి చేరాయి. దీంతో ఫారెక్స్ నిల్వలు కలిగిన దేశాల జాబితాలో రష్యాను అధిగమించి భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానానికి ఎగబాకింది.
Forex reserves : భారతదేశ ఆర్థికవ్యవస్థ (Indian Economy) మరో కీలక మైలురాయిని అందుకుంది. ఆర్బీఐ (RBI) చేపట్టిన ప్రత్యేక పథకం కారణంగా దేశంలోకి డాలర్ల ప్రవాహం (Dallors flow) రికార్డు స్థాయిలో పెరగడంతో విదేశీ మారక నిల్వలు (Forex reserves) ఆల్-టైమ్ గరిష్ఠానికి చేరాయి. దీంతో ఫారెక్స్ నిల్వలు కలిగిన దేశాల జాబితాలో రష్యాను అధిగమించి భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానానికి ఎగబాకింది. ‘బ్లూమ్‌బర్గ్’ డేటా ప్రకారం.. సెప్టెంబర్ 4తో ముగిసిన వారంలో భారత ఫారెక్స్ నిల్వలు ఏకంగా 44.9 బిలియన్ డాలర్లు పెరిగి 785.7 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి.
ఈ భారీ పెరుగుదలతో ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న రష్యాను భారత్ వెనక్కి నెట్టింది. ప్రస్తుతం ఈ జాబితాలో చైనా, జపాన్, స్విట్జర్లాండ్ మాత్రమే భారత్ కంటే ముందు ఉన్నాయి. ఆర్బీఐ ఈ ఏడాది జూన్ 8న ప్రవేశపెట్టిన ఫారెన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంక్) డిపాజిట్ల (FCNR-B) స్పెషల్ స్వాప్ పథకానికి అనూహ్య స్పందన లభించడమే ఈ డాలర్ల వరదకు ప్రధాన కారణంగా నిలిచింది. ఈ పథకం ద్వారా కేవలం 11 వారాల్లోనే దేశంలోకి 73 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి.
నిర్దేశిత లక్ష్యం గడువు కంటే ముందే నెరవేరడంతో, ఆర్బీఐ ఈ పథకాన్ని సెప్టెంబర్ 30కి బదులుగా ఆగస్టు 31నే ముగించింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో దేశ పసిడి నిల్వల విలువ 2.59 బిలియన్ డాలర్లు తగ్గినా, డాలర్ల ప్రవాహం అధికంగా ఉండటంతో మొత్తం నిల్వలు భారీగా పెరిగాయి. విదేశీ మారక నిల్వలు ఇంత భారీగా పెరగడం దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠతకు సంకేతమని, ఇది రూపాయి విలువలో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు స్థిరీకరించేందుకు ఆర్బీఐకి మరింత బలాన్ని ఇస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

