నిజామాబాద్ : సందర్భం ఏదైనా పిల్లలు కనబడితే చాలు వారితో కలిసి సరదాగా ఆడుకోవడం శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి అలవాటు. ఎంత పెద్ద హోదాలో ఉన్నా వారిలో ఒకడిగా కలిసి గడపడం స్పీకర్ పోచారంకి మాత్రమే సాధ్యం.
బుధవారం తన స్వగ్రామం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామం వెళ్లి వస్తున్న స్పీకర్‌కి మార్గమధ్యలో దేశాయిపేట గ్రామంలో క్రికెట్ ఆడుతున్న పిల్లలు కనిపించగానే కారు దిగి ఇలా బ్యాటు అందుకున్నారు. పిల్లలు బాల్ విసరగా షాట్లు కొట్టి స్పీకర్ అలరించారు.
ఇవి కూడా చదవండి..
Road accident : రోడ్డు ప్రమాదంలో సాప్ట్వేర్ ఇంజినీర్ మృతి
పేదరికం, ఊబకాయంతో అధిక రక్తపోటు ముప్పు!
Job news|న్యూ ఇండియా అస్యూరెన్స్‌లో 300 పోస్టులు