పేదరికం, ఊబకాయంతో అధిక రక్తపోటు ముప్పు!

జెనీవా : ప్రపంచవ్యాప్తంగా ఏటా 130 కోట్ల మంది అధిక రక్తపోటు బారినపడుతున్నారని వీరు సకాలంలో వ్యాధిని గుర్తించలేకపోవడంతో గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. జీవన శైలి వ్యాధి అయిన బీపీని సులభంగా గుర్తించే వెసులుబాటుతో పాటు తక్కువ ఖర్చుతో కూడిన మందులతో అదుపులో ఉంచుకునే వీలున్నా రోగుల్లో సగం మంది తమకు బీపీ ఉందనే విషయం తెలియడం లేదని దీంతో తీవ్ర అనారోగ్యాలు తలెత్తుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.
సంపన్న దేశాలు బీపీని చాలా వరకూ అదుపులోకి తీసుకురాగా అల్పాదాయ దేశాల్లో హైపర్‌టెన్షన్ వ్యాప్తి చెందడం టెన్షన్‌కు గురిచేస్తోందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ఊబకాయం, పేదరికం అధిక రక్తపోటుకు దారితీస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ, ఇంపీరియల్ కాలేజ్ లండన్ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం తెలిపింది. సబ్ సహరన్ ఆఫ్రికా, దక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాలతో పాటు, కొన్ని ఫసిఫిక్ ఐలాండ్ దేశాల్లో హైపర్ టెన్షన్‌కు అవసరమైన చికిత్సను రోగులు పొందడం లేదని అధ్యయనం పేర్కొంది.
ఇక 2019లో గుండె జబ్బులతో 1.8 కోట్ల మంది మరణించగా వీరిలో అత్యధిక మరణాలకు అధిక రక్తపోటు ప్రధాన కారణమని అధ్యయనం తెలిపింది. జన్యుపరమైన రిస్క్ ఫ్యాక్టర్స్‌తో పాటు జీవనశైలి, అనారోగ్యకర ఆహారం, శారీరక వ్యాయామం కొరవడటం, ధూమపానం, మద్యపానం, ఊబకాయం వంటి కారణాలూ అధిక రక్తపోటుకు దారితీస్తున్నాయని పేర్కొంది. జీవనశైలి మార్పులతో ఈ పరిస్ధితిని నివారించవచ్చని అధ్యయనం స్పష్టం చేసింది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

