Bullet Proof Jacket | అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్.. అభివృద్ధి చేసిన డీఆర్డీవో
Bullet Proof Jacket | డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను అభివృద్ధి చేసింది. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్.. యూనిట్ హైయెస్ట్ థ్రెట్ లెవెల్-6లోనూ రక్షిణ కల్పిస్తుంది. తాము దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను విజయవంతంగా అభివృద్ధి చేశామని మంగళవారం డీఆర్డీవో ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.
Bullet Proof Jacket : డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను అభివృద్ధి చేసింది. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్.. యూనిట్ హైయెస్ట్ థ్రెట్ లెవెల్-6లోనూ రక్షిణ కల్పిస్తుంది. తాము దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను విజయవంతంగా అభివృద్ధి చేశామని మంగళవారం డీఆర్డీవో ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఈ జాకెట్ కొత్త డిజైన్తో రూపొందించబడిందని, దీని తయారీలో ప్రత్యేక మెటీరియల్ను ఉపయోగించడంతో పాటు, కొత్త పద్ధతిని అనుసరించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘డీఆర్డీవోకు చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (DMSRDE) – కాన్పూర్’ మందుగుండు సామగ్రి నుంచి రక్షణ కోసం దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను అభివృద్ధి చేసింది. ఇటీవలే ఈ జాకెట్ను విజయంతంగా పరీక్షించామని రక్షణ శాఖ పేర్కొంది.
ఈ జాకెట్కు ఉన్న ఫ్రంట్ హార్డ్ ఆర్మర్ ప్యానెల్ (HAP) పలు హిట్ (ఆరు షాట్లు) లను ఎదుర్కొంది. సమర్థవంతంగా రూపొందించిన ఫ్రంట్ హార్డ్ ఆర్మర్ ప్యానెల్ పాలిమర్ను మోనోలిథిక్ సిరామిక్ ప్లేట్తో తయారు చేశారు. ఇది ఆపరేషన్ సమయంలో సామర్థ్యాన్ని, సౌకర్యాన్ని పెంచుతుంది. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను విజయవంతంగా అభివృద్ధి చేసినందుకు రక్షణ శాఖ ఆర్అండ్ డీ సెక్రెటరీ, డీఆర్డీవో చైర్మన్.. DMSRDEని అభినందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

