సౌత్ ఆఫ్రికా : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాగంటి సునీతకి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సదుపాయాలు, పారదర్శక పాలన కోసం బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు. మాగంటి సునీత తెలంగాణ అభివృద్ధి పథంలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
అలాగే బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కమిటీ ఈ ఉపఎన్నికల ప్రచారంలో పూర్తి ఉత్సాహంతో పాల్గొంటుందని ఆయన తెలిపారు. మెడసాని నరేందర్ రెడ్డి, గుండా జైవిష్ణు నాయకత్వంలో సౌత్ ఆఫ్రికా ప్రతినిధి బృందం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రచార కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతారన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.