హైదరాబాద్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ (Singapore) ఉపాధ్యక్షుడు గోనె నరేందర్ రెడ్డి(Gone Narender Reddy) (54) 11 సెప్టెంబర్ 2024 న తీవ్ర గుండెపోటుకు గురై మృతి చెందారు. నరేందర్ రెడ్డి మృతితో తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఆయన చేసిన సేవలను తలుచుకొని బాదాతప్త హృదయంతో నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఆయన మృతదేహాన్ని ఇండియాకు తరలించి కర్మకాండలు జరిపించేందుకు సొసైటీ తరఫున పూర్తి సహాయ సహాకారాలు అందజేస్తామన్నారు.
కాగా, జగిత్యాల జిల్లా కొత్తపేట్ మండలం వెల్గటూర్కు చెందిన గోనె నరేందర్ గత 25 సంవత్సరాల నుంచి సింగపూర్లో ఉంటున్నారు. ప్రస్తతం తన కుటుంబతో సహా శాశ్వత నివాస హోదాలో సింగపూర్లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
Jani Master | జానీ మాస్టర్ కోసం గాలింపు.. బాధితురాలి ఇంటికి పోలీసులు..!
Jani Master | ఇది లవ్ జిహాద్ కేసు.. జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి
Vetrimaaran | వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 షూట్ టైం.. ఏ సీన్లు చిత్రీకరిస్తున్నారో తెలుసా..?