BRS Australia | బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో కేటీఆర్ పర్యటన సన్నాహక సమావేశాలు
BRS Australia | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్ట్రేలియా పర్యటన ప్రవాస తెలంగాణ సమాజానికి ఒక ముఖ్యమైన సందర్భంగా నిలుస్తుందని, తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్ రాజకీయాలు మరియు ప్రవాస భారతీయుల పాత్రపై విస్తృత చర్చలకు ఈ పర్యటన వేదిక కానుందని పేర్కొన్నారు.
BRS Australia | సిడ్నీ: అక్టోబర్లో జరగనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిపాదిత ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతం చేయడానికి సిడ్నీ, కాన్బెర్రాలో నగరాల్లో నిన్న, ఈరోజు బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు, ప్రవాస తెలంగాణవాసులు, సంఘాలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
పర్యటనకు సంబంధించిన కార్యక్రమాల రూపకల్పన, వివిధ నగరాల్లో నిర్వహించాల్సిన సమావేశాలు, ప్రవాస తెలంగాణవాసులతో ముఖాముఖి కార్యక్రమాలు, యువతతో ప్రత్యేక చర్చలు, అలాగే సమన్వయ కమిటీల ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. అదేవిధంగా త్వరలో ఏర్పాటు చేయనున్న నూతన కమిటీలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, సంస్థాగత బలోపేతంపై పాల్గొన్న వారి అభిప్రాయాలను సేకరించారు.
సిడ్నీ సమావేశంలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, సాయిరాం ఉప్పు, రాజేష్ రాపోలు, మర్రి వెంకట్ రెడ్డి సుతారి శ్రీనివాస్, సుతారి మధు, రవిశంకర్ దూపాటి, రవిచింతమణి, మహేష్, సాయి గుప్తా, రామ్ మద్దూరి, లక్ష్మణ్ నల్లన్, రాహుల్, పరశురాం తదితరులు పాల్గొన్నారు. అలాగే కాన్బెర్రాలో నిర్వహించిన సమావేశంలో రవి సాయల, రాకేష్ లక్కరాసు, వీరు సాంబరాజు, అనూప్ రెడ్డి, అజయ్ రెడ్డి తదితరులు పాల్గొని పర్యటన విజయవంతానికి తమ సూచనలు, సహకారాన్ని అందించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కేటీఆర్ ఆస్ట్రేలియా పర్యటన ప్రవాస తెలంగాణ సమాజానికి ఒక ముఖ్యమైన సందర్భంగా నిలుస్తుందని, తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్ రాజకీయాలు మరియు ప్రవాస భారతీయుల పాత్రపై విస్తృత చర్చలకు ఈ పర్యటన వేదిక కానుందని పేర్కొన్నారు. పర్యటనను విజయవంతం చేయడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Read Also :
Maa Inti Bangaram | బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’.. రెండు రోజుల్లో రూ.25 కోట్లకు పైగా వసూళ్లు!
Baahubali Docuseries | ‘బాహుబలి’ తెరవెనుక కథ.. జూన్ 26న నెట్ఫ్లిక్స్లో ‘ది టార్చ్ బేరర్’ డాక్యుమెంటరీ సిరీస్
Tandur | తాండూర్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

