Kasarla Nagender Reddy | ఆస్ట్రేలియాలో AA మీడియా హౌస్ నిర్వహించిన సర్వేలో భారతీయులు వేసిన ఓట్లలో అత్యధిక ఓట్లు సాధించి ఉత్తమ కమ్యూనిటీ లీడర్‌గా కాసర్ల నాగేందర్ రెడ్డి ఎంపికయ్యారు. మిగతా విభాగాలతో పోలిస్తే ఉత్తమ కమ్యూనిటీ లీడర్ విభాగంలో నాగేందర్ ఎక్కువ ఓట్లు పొందారు. అదేవిధంగా ఉత్తమ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ విభాగంలో నల్గొండకు చెందిన సురేందర్ రెడ్డి తిమ్మాపురం, ఉత్తమ మహిళా నాయకురాలు విభాగంలో తెలుగు దేశం పార్టీకి చెందిన సుమ తాటినేని అత్యధిక ఓట్లతో విజేతలుగా నిలిచారు. అలాగే ఉత్తమ రెస్టారెంట్ విభాగంలో ఆస్ట్రేలియాలో అత్యధిక బ్రాంచ్‌లు కలిగిన దోస హట్ గెలుచుకుంది.
ప్రతీ విభాగంలో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, కమ్యూనిటీ లీడర్ విభాగంలో నాగేందర్ రెడ్డికి లభించిన అధిక సంఖ్యలో ఓట్లు, ఆయనకు ఆస్ట్రేలియాలోని భారతీయులలో ఉన్న విశ్వాసాన్ని, అభిమానాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఈ అవార్డు ప్రదానం చేసిన ఆస్ట్రేలియా లేబర్ పార్టీ ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు బ్రాడ్ పాట్టిన్ తెలిపారు. అలాగే ఈ అవార్డు ప్రధానంలో భారత హై కమిషనర్, భారతీయ సంఘాల నాయకులు, ప్రజలు అత్యధికంగా పాల్గొన్నారు.
గతంలో కూడా ఐదు సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఓటింగ్‌లో కాసర్ల నాగేందర్ రెడ్డి అత్యధిక ఓట్లు సాధించి బెస్ట్ ఎన్ఆర్ఐగా నిలిచారు. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన నాగేందర్ గత దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ.. సమాజ సేవలో అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇది సమాజ సేవకు లభించిన గుర్తింపని ఈ సందర్భంగా కాసర్ల నాగేందర్ రెడ్డి అన్నారు. తనకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించిన భారతీయులకు కాసర్ల నాగేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Harish Rao | పెట్రోల్‌కు రేవంత్ డబ్బులు ఇస్తున్నాడా..? పోలీసులకు హరీశ్‌రావు సూటి ప్రశ్న
పార్టీ మారితేనే సహకారం.. లేదంటే తిరస్కారం..