కువైట్ : కువైట్లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బులివార్డ్ క్రికెట్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సామూహిక యోగా కార్యక్రమంలో కువైట్ నలుమూ లల నుంచి వచ్చిన దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, కమ్యూనిటీ నాయకులు, విద్యార్థులు, యోగా ప్రేమికులు సహా 2,200 మందికి పైగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కువైట్ యోగా కమిటీ అధ్యక్షురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత హెచ్.ఈ. షైఖా షైఖా అల్ సబాహ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అలాగే సౌదీ అరేబియాలోని అరబ్ యోగా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఆసియన్ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీమతి నౌఫ్ మార్వాయి కూడా పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సామూహిక యోగా కార్యక్రమంతో పాటు “యోగ ఇన్ ఫోకస్” ఫోటో పోటీ ప్రదర్శన తో పాటు యోగా అంశాలపై రూపొందించిన చిత్రాల ప్రదర్శన కూడా సందర్శకులను ఆకట్టుకుంది. ఆరోగ్యం, సామరస్యం, శ్రేయస్సును యోగా ద్వారా ప్రోత్సహిస్తూ ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ భారత రాయభారి పరమిత త్రిపాఠి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.