జోహన్నెస్‌బర్గ్ : సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్ధమైన పదవిని దుర్వినియోగం చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కక్షపూరిత చర్యలకు పాల్పడటం ఆందోళనకరమైన విషయం. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, విపక్ష నాయకుల గొంతుకలను అణగదొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నించాడాన్ని ఖండిస్తున్నామని సౌత్ ఆఫ్రికా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల తెలిపారు. హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన ఫార్ములా–ఈ రేసు కార్యక్రమాన్ని రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వక్రీకరిస్తూ కేటీఆర్‌ను ఇబ్బందులకు గురిచేయడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
సొంత పాలనా వైఫల్యాలను నుంచి దృష్టి మళ్లించడానికి కేటీఆర్ పై తప్పుడు కేసులు మోపడం కాంగ్రెస్ చౌకబారు తనానికి నిదర్శనమన్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల దశలో ఇలాంటి స్వార్థపూరిత రాజకీయాలను తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. ఇలాంటి బెదిరింపులు, కుట్రలు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మనోబలాన్ని ఏమాత్రం దెబ్బతీయవని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని కుట్రలను ప్రజలతో కలిసి రాజకీయంగా ఎదుర్కుంటామన్నారు.