అమెరికా : అమెరికాలోని ఇర్వింగ్ సిటీలో గల రివర్ సైడ్ విలేజ్ కమ్యూనిటీలో వినాయక చవితిని కమ్యూనిటీ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. ప్రతిరోజు సంప్రదాయ, ఆటపాటలతో హోరెత్తించారు.
సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాలుపంచుకొని అతిథులని అలరించారు. ఇండియా నుండి వచ్చిన తల్లిదండ్రులు కూడా పిల్లలతో పోటీగా నృత్యం చేసి సందడి చేశారు. గణపతిని పుర విధులలో ఘనంగా ఊరేగించి వీడ్కోలు పలికారు.