లండన్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలకు చేసిందేమి లేదని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ( BRS UK ) ఉపాధ్యక్షుడు రవి రేతినేని ( Ravi Rethineni ) ఆరోపించారు. తన బాషా, ఇతరులని అవమానించే ధోరణితో రాష్ట్ర పరువును తీస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నో సందర్భాలల్లో రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐలను చులకన అభిప్రాయంతో మాట్లాడడం, అవమానించడం ఎన్ఆర్ఐల మనోభావాల్ని కించపరచడం ఎన్ఆర్ఐల సమాజాన్ని తీవ్రంగా బాధిస్తుందని పేర్కొన్నారు.
బతుకుదెరువుకు వివిధ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు తమ రోజు వారి ఇంటి పనులు వారు చేసుకోవడం సహజ పరిణామమని గుర్తు చేశారు. అదేదో అవమానకరమైన పని లాగ చిత్రకరించి ఎగతాళి చెయ్యడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా వెకిలి మాటలు మానేసి, ప్రజల సంక్షేమం, అభివృద్ధి పై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి లాగ ఓటుకు నోటుకు సంచులు మోసి ఎన్ఆర్ఐలుగా గా ఎవరు స్థిరపడలేదని, వారి కష్టం తో వారు బతుకుతున్నారని వివరించారు.
రేవంత్ రెడ్డి కి మద్దతిచ్చే ఎన్ఆర్ఐలు సైతం ఆలోచించుకోవాలని సూచించారు. లేకుంటే సీఎంగా గౌరవం ఉండదని అన్నారు. తెలంగాణ గడ్డ అంటేనే ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చే గడ్డ. మన ఆత్మగౌరవాన్ని అవమానించే పరిస్థితి వస్తే ఎవరిని ఉపేక్షిహించేది ఉండదని,రేవంత్ రెడ్డి పద్ధతి మార్చుకొని పాలన పై శ్రద్ధ పెట్టాలని రవి రేతినేని సూచించారు. పద్ధతి మార్చుకో అవమానిస్తే, ఎన్ఆర్ఐలంతా సంఘటితమై ఉద్యమిస్తామని హెచ్చరించారు.