NRI | లండన్‌లో ఛలో నల్లగొండ సభ పోస్టర్ ఆవిష్కరణ
NRI | నదీ జలాల హక్కుల పరిరక్షణకై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13న నిర్వహించనున్న ‘ఛలో నల్లగొండ’ భారీ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని ఎన్నారై బీఆర్ఎస్ యూకే కోర్‌కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.
లండన్ : నదీ జలాల హక్కుల పరిరక్షణకై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13న నిర్వహించనున్న ‘ఛలో నల్లగొండ’(Chalo Nalgonda Sabha) భారీ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని ఎన్నారై బీఆర్ఎస్ యూకే కోర్‌కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.
ఈ మేరకు లండన్(London)లోని కేంద్ర కార్యాలయంలో బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అశోక్ గౌడ్ దూసరి , నవీన్ రెడ్డి , సిక్కా చంద్రశేఖర్ గౌడ్ , సురేష్ బుడగం, రవి రేతినేని, సతీష్ రెడ్డి గొట్టెముక్కల మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వనరులు సురక్షితంగా ఉన్నాయ చెప్పారు.
కానీ రెండు నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి నాటి సమైక్య పాలనను గుర్తు తెస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ హక్కులను కాలరాస్తే బీఆర్ఎస్ పార్టీ అడుగడుగునా పోరాటాం చేస్తూ ప్రజలకు అండగా నిలబడుతుందని తెలిపారు. ఫిబ్రవరి 13 వ తేదీన నల్గొండలో జరగబోయే సభకు అన్ని వర్గాల ప్రజలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలునిచ్చారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

