లండన్ : తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 26వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా లండన్లో ఏన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి గులాబీ జెండా పండుగ నిర్వహించి, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. యూకే లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎందరో తెలంగాణ ఎన్నారైలు , ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారందరికీ పార్టీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పనిచేయాలనే సంకల్పంతో పార్టీలో చేరుతున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రజలకోసం పని చేసేది, అన్ని సందర్భాల్లో తెలంగాణ ప్రజల పక్షాన నిలిచింది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతోనే ఎన్నారైలు అంతా బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారని తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు హరి గౌడ్ నవాపేట్, సత్యమూర్తి చిలుముల, రవి రెటినేని, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ గణేష్ కుప్పాల, కార్యదర్శి – ఐటీ, మీడియా అండ్ పీఆర్ రవి, ప్రదీప్ పులుసు, కార్యదర్శులు అబూ జాఫర్, సురేష్ గోపతి, కోశాధికారి సురేష్ బుడగం, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేష్ ఇస్సంపల్లి, సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్ రావు కటికనేని, మెంబర్షిప్ కో ఆర్డినేటర్ అంజన్ రావు, యూత్ వింగ్ సెక్రటరీ పవన్ కుమార్ గౌడ్, యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ అబ్దుల్ కుదూస్, మీడియా కో ఆర్డినేటర్ సాయి కిరణ్ పేరాల, అజయ్ రావు, సభ్యులు అర్చన, సాయి, అనిల్,రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.