దక్షిణాఫ్రికా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటనలు చేపడుతూ ప్రజల తెలుసుకోవడం మంచి పరిణామమని సౌత్ ఆఫ్రికా బీఆర్ఎస్ ఎన్నారై ప్రెసిడెంట్ గుర్రాల నాగరాజు అన్నారు. కేటీఆర్ పర్యటనకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా శాఖ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో బీఆర్ఎస్ గాఢమైన అనుబంధాన్ని నెలకొల్పింది.
గతంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, పార్టీ శ్రేణులు గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుని నిలబడిన విధానం ప్రశంసనీయమన్నారు. ఈ పర్యటనల ద్వారా బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత నూతనోత్తేజాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థుతుల దృష్ట్యా, తెలంగాణ ప్రజలకు మళ్లీ బీఆర్ఎస్ పరిపాలన అవసరం ఉందన్నారు.