స్విట్జర్లాండ్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ స్విట్జర్లాండ్ శాఖ ఆధ్వర్యంలో జురిచ్ నగరంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. మాతృభూమికి దూరంగా ఉన్నాకూడా మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలను నిర్వహించి, ఆటపాటలతో ఎంజాయ్ చేశారు.
తెలంగాణ ఆడబిడ్డలు గందె అనుపమ, రజని తాటికొండ, లావణ్య అల్లు, శిల్ప జాల, సునీత దీకొండ, హర్షిత, ప్రభ, విలయ, లీల ఆధ్వర్యంలో రంగు రంగుల పూలతో బతుకమ్మలను అందంగా తయారు చేశారు. అనంతరం గౌరమ్మను ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో పూచించారు.
ఈ వేడుకల్లో టీఆర్ఎస్ స్విట్జర్లాండ్ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ గందే, ఉపాధ్యక్షులు అల్లు కృష్ణారెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షులు కిశోర్ తాటికొండ, జనరల్ సెక్రటరీ అనిల్ జాల, పద్మజారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.