శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nri-news - Oct 29, 2020 , 15:46:52

'ధ‌ర‌ణి' ఎన్నారైల‌కు ఎంతో ఉప‌యోగం : టీఆర్ఎస్ లండ‌న్ శాఖ‌

'ధ‌ర‌ణి' ఎన్నారైల‌కు ఎంతో ఉప‌యోగం : టీఆర్ఎస్ లండ‌న్ శాఖ‌

హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ప్రారంభించిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని టీఆర్ఎస్ లండ‌న్ శాఖ అధ్య‌క్షుడు అనిల్ కుర్మాచ‌లం తెలిపారు. ఈ పోర్ట‌ల్ ప్రారంభంతో రెవెన్యూ వ్య‌వ‌స్థ‌లో న‌వ శ‌కానికి తెలంగాణ ప్ర‌భుత్వం నాంది ప‌లికింద‌న్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ద్వారా విదేశాల్లో ఉంటున్న తాము.. భూముల వివ‌రాల‌ను తెలుసుకునేందుకు సుల‌భంగా ఉంటుంద‌న్నారు. ఎన్నారైలకు ఇది ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఎన్నారైల ప‌క్షాన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఎన్నారైల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన కేటీఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.