Youth | కోటగిరి : మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోటగిరి ఎస్సై సునీల్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో మత్తు పదార్థాల నిర్మూలన పై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సునీల్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువత తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు.
కావున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పకూడదని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.