Nizamabad | కోటగిరి, ఆగస్టు 13 : మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోటగిరి ఎస్సై సునీల్ అన్నారు. సీపీ చైతన్య కుమార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల నిర్మూలన పై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సునీల్ మాట్లాడుతూ మత్తు పదార్థాల ద్వారా ఎన్నో అనార్థాలు జరుగుతున్నాయని, నేటి యువత మత్తు పదార్థులకు ఆకర్షితులవుతున్నారని అన్నారు.
మాదకద్రవ్యాల వాడకం వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. సమాజంలో మాదకద్రవ్యాల వాడకం నిర్మూలించే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. ప్రస్తుతం గ్రామాలలో, పట్టణ ప్రాంతాలలో యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని వాపోయారు. గంజాయి, మత్తు పదార్థాలు వాడకంపై సమాచారం ఉంటే 1908 నంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కైసర్ పాషా, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.