బాన్సువాడ రూరల్ : బాన్సువాడ మండలం జక్కల్ దాని తండా శివారులో శనివారం ప్రమాదవశాత్తు నిజాంసాగర్ ప్రధాన కాలువలో ( Nizamsagar main canal ) పడి సిద్దు (19) అనే యువకుడు గల్లంతయ్యాడు. మండలంలోని హన్మాజీపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని సంగ్రామ్ తండా కు చెందిన సిద్దు నిజాంసాగర్ కాలువ ఒడ్డున నిలబడి కాళ్లు, చేతులు కడుక్కొనే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ( Police ) ఘటన స్థలాలు చేరుకొని గజఈతగాళ్లతో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.