Suicide | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం వల్లభపూర్ గ్రామంలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. కోటగిరి ఎస్సై సునీల్ కథనం ప్రకారం.. వల్లభపూర్ గ్రామానికి చెందిన మేకల హనుమండ్లు (30) అని యువకుడు అప్పుల బాధ భరించలేక ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పురుగుల మందు తాగాడు.
గమనించిన కుటుంబీకులు, స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని దవఖానకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం హనుమండ్లు మృతి చెందాడు. మృతుడి భార్య మేకల గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సునీల్ తెలిపారు.