గాలే: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు టీమిండియా విక్టరీ కొట్టింది. చరిత్రాత్మకమైన 600వ టెస్టులో 165 పరుగుల తేడాతో గిల్ సేన విజయాన్ని సాధించింది. భారత స్పిన్నర్ మానవ్ సుతార్ రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసి లంకను దెబ్బతీశాడు. 372 రన్స్ టార్గెట్తో చేజింగ్ మొదలుపెట్టిన శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్లో 206 రన్స్కే ఆలౌటైంది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తొలి ఇన్నింగ్స్లో 167 రన్స్ చేయగా, ఇక బౌలర్ సుతార్ రెండు ఇన్నింగ్స్లో కలిపి పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజా విక్టరీతో రెండు టెస్టుల సిరీస్లో ఇండియా 1-0 ఆధిక్యాన్ని సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన లంక బ్యాటర్ దినుషా.. రెండో ఇన్నింగ్స్లో 84 రన్స్ చేసి ఔటయ్యాడు.
An elated #TeamIndia camp as we win the 1st Test at Galle and go 1-0 up in the series.#SLvIND pic.twitter.com/sAyxV03jcJ
— BCCI (@BCCI) August 19, 2026