Eshwar Sai : జానపద గేయాల్లో నటించే కళాకారుడు ఈశ్వర్ సాయి ఓ యువతితో ఏకాంతంగా గడుపుతూ భార్యకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అతడి భార్య మంగళవారం అర్ధరాత్రి తన బంధువులతో వచ్చి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. తనను వదిలేసి పరాయి యువతితో ఎందుకు తిరుగుతున్నావని, నా బతుకు ఏంచేద్దాం అనుకుంటున్నావని ఈశ్వర్ సాయిని అతడి భార్య నిలదీసింది.
కాగా ఈశ్వర్ సాయి, అతడితో పట్టుబడిన యువతి ఇటీవల Premila’s జానపద పాటలో ముఖ్య పాత్రలు పోషించారు. ఆ పరిచయమే వాళ్లను దగ్గర చేసింది. ఇక ‘బాసింగ బాసింగా బలాలే’ పాట ఈశ్వర్ సాయికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈశ్వర్ సాయి యువతితో పట్టుబడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి.