రెంజల్, సెప్టెంబర్ 13 : మండలంలోని నీలా గ్రామానికి చెందిన ఓ యువతి విషజ్వరంతో మృతి చెందింది. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డిగ్రీ చదువుతున్న శిరీష (25) ఉద్యోగం వెతుక్కోవడానికి ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ వెళ్లింది. అక్కడ తీవ్ర జ్వరం రావడంతో రెండురోజుల క్రితం స్వగ్రామానికి వచ్చి, స్థానికంగా ఓ ఆర్ఎంపీకి చూపించుకున్నది.
జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎంపీడీవో వెంకటేశ్ జాదవ్, మండల వైద్యాధికారి డాక్టర్ వినయ్‌కుమార్ శుక్రవారం గ్రామానికి చేరుకొని పలు వీధులను పరిశీలించారు.