నస్రుల్లాబాద్, అక్టోబర్ 7: వారం రోజుల వ్యవధిలో తాత, మనవరాలు గుండెపోటుతో మృతిచెందిన ఘటన నస్రుల్లాబాద్ మండలం సంగం గ్రామంలో చోటుచేసుకున్నది. సంగం గ్రామానికి చెందిన తార్యానాయక్ మనవరాలు డేగావత్ బినా(19) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో నర్సుగా పనిచేస్తున్నది.
వారం రోజుల క్రితం తార్యానాయక్ గుండెపోటుతో మృతి చెందడంతో డేగావత్ బినా స్వగ్రామానికి వెళ్లింది. బినాకు ఆదివారం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబీకులు వెంటనే నిజామాబాద్ దవాఖానకు తరలించారు. యువతిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. వారం రోజుల వ్యవధిలో తాత, మనవరాలు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి