నాగిరెడ్డిపేట, సెప్టెంబర్14: సందడిగా మారిన పోచారం ప్రాజెక్టు వద్ద ఆదివారం సాయంత్రం విషాదం నెలకొన్నది. స్నేహితుడితో కలిసి ఈత కొడతూ ప్రమాదవశాత్తు ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు. ఏఎస్సై మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్జిల్లా కేంద్రంలోని అజంపూర్ కాలనీకి చెందిన షేక్ మహబూబ్(20) తన స్నేహితుడు వాసిమ్తో కలిసి ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా గడిపేందుకు పోచారం ప్రాజెక్టుకు వచ్చాడు.
ప్రాజెక్టు దిగువన నీటిలో ఈత కొట్టడానికి వెళ్లారు. మహబూబ్ ఈత కొడుతూ ముందుకు వెళ్లి ఊపిరాడక నీట మునిగిపోవడం తో.. అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో మహబూబ్ మృతదేహాన్ని బయటికి తీయించారు. మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఏఎస్సై తెలిపారు.