వినాయక్ నగర్, జూన్ 21 : ప్రతీ ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య అన్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్ లో గల శ్రీరామ గార్డెన్ లో ఆయుష్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన యోగా దినోత్సవం కార్యక్రమానికి సీపీ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం మాట్లాడారు.
యోగా ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యతకు దోహదపడుతూ ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుందన్నారు. యోగా అనేది శరీర దృఢత్వానికి మనసు ప్రశాంతతకు చాలా ఉపయోగకరమైందని సూచించారు. యూవత డ్రగ్స్ వాడకం తగ్గించాలని తెలియజేశారు. అలాగే జూన్ 26న ఆంటీ డ్రగ్స్ డే రావడం తో పాటు ఇదే నెలలో ఈ రోజు యోగా దినం రావడం ఎంతో మంచిదని అన్నారు.
అనంతరం వివిధ రకాల యోగ ఆసనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్లు (అడ్మిన్ ) బస్వారెడ్డి, రాంచంధర్ రావ్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, యోగా గురువులు సంగీత, డాక్టర్ తిరుపతిరావు, గంగాధర్, ప్రభాకర్, వెంకటేశ్వర్లు, రామచందర్, జిల్లా వ్యాప్తంగా వివిధ యువజన సంఘాలు, విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.