నందిపేట్, సెప్టెంబర్ 29: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, ఉమ్మెడ గ్రామానికి చెందిన మహిళలు శుక్రవారం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బిగాల సమక్షంలో చేరికలు..ఖలీల్‌వాడి,
సెప్టెంబర్ 29 : నగర శివారు నాగారం ప్రాంతానికి చెందిన 200 మంది యువకులు శుక్రవారం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే బిగాల గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ .. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. బీఆర్ఎస్ నాయకులు దండు శేఖర్, సుజిత్‌సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, ముజాహిద్ఖాన్, ఖలీమ్, సలీం, దామఖాన్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ఆర్పీల వేతనాలను ఇటీవల పెంచింది. ఈ నేపథ్యంలో మండలంలోని మెప్మా ఆర్పీలు శుక్రవారం అంకాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి పూలమొక్కను అందజేశారు. మెప్మా ఆర్పీల సంఘం అధ్యక్షురాలు అరుణ, కార్యదర్శి కమల, కోశాధికారి మహిపాల్, సహాయ కార్యదర్శి కల్పన, ఉపాధ్యక్షురాలు అన్నపూర్ణ, రజిత, సింగారం తిరుమల తదితరులు ఉన్నారు.
-ఆర్మూర్, సెప్టెంబర్ 29