Woman Suicide | లింగంపేట్ (తాడువాయి), ఫిబ్రవరి 14: తాడువాయి మండలం కాళోజివాడి గ్రామ వాసి సాయవ్వ (58) అనే మహిళ కడుపునొప్పి భరించలేక గ్రామ శివారు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ కొండల్ రెడ్డి తెలిపారు. కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు పలు ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న కడుపునొప్పి తగ్గకపోవడంతో కలత చెంది చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మృతురాలి కుమారుడు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
రెంజల్. ఫిబ్రవరి 14: రెంజల్ మండలం కందకుర్తి గోదావరి నదిలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైనట్లు రెంజల్ పోలీసులు తెలిపారు. కందకుర్తి – ధర్మాబాద్ అంతరాష్ట్ర వంతెన పుష్కర ఘాట్కి వెళ్ళే మార్గంలో నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి సుమారు వయస్సు (30- 40) ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.