మోర్తాడ్, మే 2: ప్రియుడు పెండ్లి చేసుకుంటానని మోసం చేశాడని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి పోలీసు స్టేషన్ భవనంపై నుంచి దూకిన ఘటన బాల్కొండ మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. బాల్కొండ ఎస్సై శైలేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాల్కొండకు చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన సాయికుమార్ ప్రేమించి, పెండ్లి చేసుకుంటానని మోసం చేశాడని యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో సాయికుమార్‌ను శుక్రవారం స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా.. ఇప్పటికే తనకు పెండ్లి అయ్యిందని, కూతురు కూడా ఉన్నదని, తాను మరో పెండ్లి ఎలా చేసుకుంటానని చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన సదరు యువతి తాను చనిపోతానంటూ పరుగెత్తుకుం టూ వెళ్లి పోలీస్‌స్టేషన్ బిల్డింగ్‌పైకి ఎక్కి కిందికి దూకింది. యువతికి స్వల్ప గాయాలు కాగా, చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు.