న్యూఢిల్లీ : ఉక్రెయిన్లో ఒక నౌకపై జరిగిన దాడిలో 13 మంది భారతీయులు చిక్కుకుపోయారు. ఎంవీ అమీర్ 1 అనే నౌక డ్రోన్, క్షిపణి దాడులకు గురైంది. దాడి సమయంలో 15 మంది నౌకా సిబ్బంది ఉన్నారు. ఈ విషయంలో తక్షణ సహాయం అందించాలని ఇండియన్ సీమెన్ యూనియన్ విజ్ఞప్తి చేసింది.
ఈ నౌక చుట్టుపక్కల నిరంతరాయంగా డ్రోన్, క్షిపణి దాడులు జరుగుతున్నాయని, దీంతో నౌకలోని సిబ్బంది బిక్కుబిక్కుమంటున్నారని తెలిపింది. ఈ నౌకపై ఏ క్షణమైనా నేరుగా దాడిజరగవచ్చునని, కాబట్టి అందులోని సిబ్బందిని రక్షించాలని యూనియన్ కోరింది.