చాయ్‌వాలా కూతురు, బీడీ కార్మికురాలి కొడుకు, వ్యవసాయ కూలీల బిడ్డలు.. వీరి దరికి చేరింది వైద్య విద్య. డాక్టర్ చదవాలన్న పేదింటి పిల్లల కల నెరవేర్చారు సీఎం కేసీఆర్. జిల్లాకో మెడికల్ కళాశాలను ప్రారంభించడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు ఉచితంగానే ఎంబీబీఎస్ చదివే అవకాశం కల్పించారు. డబ్బులున్నవాళ్లకే సాధ్యమనుకున్న ఎంబీబీఎస్.. సాధారణ కుటుంబాలకు స్వాగతం పలుకడం విశేషం. తమ బిడ్డలూ డాక్టర్ చదివేలా కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు వేవేల కృతజ్ఞతలు తెలుపుతున్నారు తల్లిదండ్రులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఎంబీబీఎస్ విద్యార్థుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..
Cm Kcr
చాయ్‌వాలా బిడ్డకు డాక్టర్ సీటు..
భీమ్‌గల్ : భీమ్‌గల్ మండలంలోని బాచన్పల్లికి చెందిన ఫయీం చాయ్ హోటల్ నడిపిస్తున్నాడు. తన ముగ్గురు పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనే లక్ష్యంతో కష్టపడుతున్నాడు. పెద్దకూతురు సుమయా మహేక్ గతేడాది జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేవు. తమ సంతోషానికి సీఎం కేసీఆరే కారణమని, వైద్య కళాశాలల సంఖ్య పెంచడంతోనే తమ బిడ్డ డాక్టర్ కానుందని సంబురపడ్డారు.
ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తున్నది..
కోటగిరి : నా పేరు మాలీపాటిల్ స్నిగ్ధ. మాది ఉమ్మడి కోటగిరి మండలం పాత పొతంగల్. రైతు కుటుంబం. అమ్మ శైలజ, నాన్న శివకుమార్. నేను 7వ తరగతి వరకు బోధన్ పట్టణంలోని మాతృశ్రీ హైస్కూల్లో, 8 నుంచి 10వరకు బోధన్ విజయసాయి హైస్కూల్లో చదివాను. హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తిచేసి, ఎంసెట్‌లో ఆలిండియా 26వేలు ర్యాంక్, స్టేట్‌లో వెయ్యి ర్యాంక్ సాధించారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. నా వైద్య విద్య కోసం ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. సీఎం కేసీఆర్ సహకారంతోనే నేను డాక్టర్ కావాలన్న మా తల్లిదండ్రుల కల నెరవేరబోతున్నది.
కేసీఆర్‌పై భరోసాతో చదివాను..
కమ్మర్పల్లి: మాది నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి. మధ్యతరగతి కుటుంబం. నాన్న ఐకేపీలో ఉద్యోగి. అమ్మ బీడీ కార్మికురాలు. 5వ తరగతి వరకు సుమారు రూ.లక్ష ఖర్చు పెట్టి ప్రైవేటు పాఠశాలలో చదివించారు. అనంతరం నిజాంసాగర్ నవోదయలో ఇంటర్ వరకు చదివాను. నీట్ కోచింగ్‌కు సుమారు రూ.లక్షా 50 వేలు ఖర్చు పెట్టారు. మెడికల్ కాలేజీలు, సీట్ల సంఖ్య పెరగడంతో తప్పక సీటు వస్తుందనే భరోసా కలిగింది. నీట్లో 14,329 ర్యాంకుతో ఓబీసీ విభాగంలో వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజ్‌లో సీటు వచ్చింది.
– సుంకరి శ్రీవర్ధన్, కమ్మర్పల్లి
రూపాయి ఖర్చు లేకుండా సీటు వచ్చింది..
కోటగిరి : నా పేరు గాండ్ల ధనుంజయ్. మాది కోటగిరి మండలం రాంగంగానగర్ (పోచారం నగర్). అమ్మ గాండ్ల ప్రేమలత అంగన్వాడీ టీచర్. నాన్న సాయినాథ్ పీఎంపీ. నేను 5వ తరగతి వరకు సాలూరా ప్రజ్ఞశ్రీ హైస్కూల్లో, 6 నుంచి 10వ తరగతి వరకు బోధన్ పట్టణంలోని మాతృశ్రీ హైస్కూల్లో చదివాను. అనంతరం హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ చదివి, 2019లో ఎంసెట్ రాశాను. ఆలిండియా లెవల్లో 43వేల ర్యాంక్ రాగా సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. రూపా యి ఖర్చు లేకుండా ఎంబీబీఎస్ ప్రవేశం కల్పించిన సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా..
ఎంత కష్టపడ్డా సీటు లభించని ఈ రోజుల్లో జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి మాలాంటి పేదవారు కూడా వైద్య విద్యను అభ్యసించేలా చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా. భవిష్యత్తులో మంచి డాక్టర్ అయి పేదలకు సేవ చేయడమే నా లక్ష్యం.
– మహ్మద్ రయాన్ మెయినుద్దీన్, ఎంబీబీఎస్ విద్యార్థి, మెదక్
ప్రతి పేదోడూ ఎంబీబీఎస్ చదివేలా..
రుద్రూర్ : మాది రుద్రూర్ గ్రామం. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఏటా క్లాస్ ఫస్ట్ వచ్చేది. ఒకటి నుంచి 7వ తరగతి వరకు బోధన్‌లోని మాతృశ్రీ, 8 నుంచి 10వరకు విజయసాయి పాఠశాలలో చదివాను. హైదరాబాద్ శ్రీచైతన్య కళాశాలలో ఉచితంగా ఇంటర్ సీటొచ్చింది. తర్వాత 2019లో ఓపెన్ కేటగిరీలో ఉస్మానియా కాలేజీలో మెడికల్ సీటు సాధించాను. ఖర్చు లేకుండా సీటు రావడం ఆనందంగా ఉంది. జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి బాగా చదువుకునే ప్రతి పేదోడికీ మెడికల్ సీటు వచ్చేలా వైద్యవిద్యను అందుబాటులోకి తేవడం హర్షణీయం.
– జక్కు శివతేజ, రుద్రూర్
సీఎం కేసీఆర్‌ను ఎప్పటికీ మరువను..
చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలన్న కోరిక తీరింది. కేవలం డబ్బున్న వాళ్లకు మాత్రమే కాదు, అందరూ డాక్టర్లు కావొచ్చు. దీనంతటికీ కారణం సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం వైద్యవిద్యకు పెద్దపీట వేయడం, కళాశాలలను పెంచడంతో మాలాంటి నిరుపేదలు ఎంబీబీఎస్ కల నెరవేరుతున్నది. సీఎం మేలును ఎప్పటికీ మరువను.
మెడికల్ సీట్ రాదనుకున్నా..
కామారెడ్డి 8: హైదరాబాద్‌లోఉన్న నాకు సీటు రాకపోయే సరికి బాధపడ్డా. ఇక మెడికల్ సీట్ రాదనుకున్నా. కానీ సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడంతో నాకు సులభంగా మెడికల్ సీటు వచ్చింది. వేరే రాష్ర్టాలకు వెళ్లకుండా స్వరాష్ట్రంలోనే, అందులోనూ దగ్గరలోనే కామారెడ్డి మెడికల్ కళాశాల ఉండడం సంతోషకరం.
– ఎ.లక్ష్మీనారాయణ, ఎంబీబీఎస్ విద్యార్థి, హైదరాబాద్