ఎల్లారెడ్డి పట్టణంతోపాటు లింగంపేట మండల కేంద్రాన్ని సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 7.30 గంటలు అయినా సూర్యుడు మంచు దుప్పటి చాటునే ఉన్నాడు. పొగమంచు కారణంగా ఎల్లారెడ్డి ప్రధాన రహదారి కనిపించకపోవడంతో రెండు గంటల పాటు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
హెడ్లైట్ల వెలుతురులో నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది. లింగంపేట మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాలను మంచు దుప్పటి కమ్మేసింది. ప్రకృతి ప్రేమికులు ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు.
– ఎల్లారెడ్డి రూరల్/ లింగంపేట, డిసెంబర్ 9