Chukkapur Lakshmi Narasimha Temple | మాచారెడ్డి : మండలం చుక్కాపూర్ లక్ష్మీ నరసింహ ఆలయ అభివృద్ధిక కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులతో షబ్బీర్అలీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలా మహిమలు గలదన్నారు.
ఆలయానికి రోడ్డు మరియు కరంటు ఏర్పాటు చేసే భాగ్యం తనకే దక్కిందని అన్నారు. చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రతీ ఆదివారం జనాలతో కిక్కిరిసిపోతుందని, కోరుకున్న వారికి కొంగు బంగారం అవుతుందని ఆలయ అభివృద్ధికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తానన్నారు. వేసవికాలంలో భక్తులకు దాహార్తి తీర్చేందుకు బోరు మోటరు ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, నౌసీ నాయక్, అనంతరెడ్డి, రమేష్ గౌడ్, సుతారి రమేష్, నా రెడ్డి మోహన్ రెడ్డి, పండ్ల రాజు, ఐరేని సందీప్, గుడుగుల శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, చందు, పుట్నాల శ్రీనివాస్, పంపరి లక్ష్మణ్, నిమ్మ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.