కాంగ్రెసోళ్లకు రైతుల కష్టాలు ఏం తెలుసు.. ధరణి ఎత్తేస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతిని ప్రవేశపెడతామని ప్రకటించడంపై రైతులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలుపుతామంటున్న కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.
ధర్పలి/కోటగిరి/సిరికొండ/, నవంబర్ 18 : కాంగ్రెస్ పార్టీ వస్తే ధరణి పోర్టల్‌ను ఎత్తివేసి భూమాత పేరిట పాత రెవెన్యూ పద్ధతిని ప్రవేశపెడతామని ప్రకటించడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్ ఇందులో భాగంగానే దశాబ్దాల తరబడి పెండింగ్‌లో భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టారు. గతంలో భూముల రిజిస్ట్రేషన్, పట్టాపాసు పుస్తకాల కోసం నెలల తరబడి రిజిస్ట్రేషన్ ఆఫీసులు, రెవెన్యూ కార్యాలయాలు తిరిగే పరిస్థితి ఉండేది. రైతుల కష్టాలను దూరం చేయవడంతో ప్రభుత్వ ప్రయోజనాలు అనర్హులకు దక్కొద్దనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. దీంతో భూముల సమస్యలు, రిజిష్ర్టేషన్లు తక్షణమే పూర్తవుతున్నాయి. ధరణి పోర్టల్‌లో ఉన్న వివరాల ఆధారంగా రైతులకు పెట్టుబడి సాయం, రైతు బీమా తదితర పథకాలు టంచన్‌గా అదుతున్నాయి. కాంగ్రెస్ అంటున్నట్లు ధరణి పోర్టల్‌ను ఎత్తివేస్తే వ్యవస్థ మొత్తం ఆగమాగవుతుందని.. మళ్లీ బాంచన్ కాళ్లు మొక్కుతా అనే పరిస్థితి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి ఎన్ని గంటల కరెంటు అవసరం పడుతుందో.. ఎన్ని హెచ్‌పీల మోటర్లు నడుస్తాయో తెలియని కాంగ్రెస్ నాయకులు అధికారం కోసం ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడడం విడ్డూరంగా మారిందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తూ సంతోషంగా సాగుతున్న తమ జీవితాల్లో చిచ్చుపెట్టాలని చూస్తే తగిన బుద్ధి చెబుతామని రైతులు హెచ్చరిస్తున్నారు.
కోటగిరి నవంబర్ 18 : కేసీఆర్ సా రు రైతుల కోసం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఉండాల్సిందే.. ధరణితో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పనులు అయిపోతున్నాయి. ఇంతకు ముందు కాంగ్రెస్ హయాంలో రిజిస్ట్రేషన్, పాస్ పుస్తకాలు కావాలన్నా నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో పుస్తకాలు వారంలోనే వస్తున్నాయి. ధరణి తీస్తామని చెప్పే కాంగ్రెస్ నా యకులకు అధికారం ఇవ్వకూడదు.. వాళ్లు వస్తే మళ్లీ రైతులకు కష్టాలు తప్పవు. కాబట్టి రైతులకు అండగా నిలిచే బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి.
ధర్పల్లి, నవంబర్ 18 : ఒక రైతుగా సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచించి స్వాతంత్య్రం రాక ముందు నుంచి రైతులు పడుతున్న కష్టాలను తొలగించాలనే ఉద్దేశంతో తీసుకవచ్చిన ధరణి పోర్టల్‌ను కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలగిస్తామనడం హాస్యాస్పదమే. రైతులకు ఇది మేలు చేసే చర్య కాదు. ఏదో వారి స్వార్థ రాజకీయ ప్రలోభం కోసం చేస్తున్న నాటకమే. ధరణి తీసేస్తే రైతులకు మళ్లీ పాత కష్టాలు ప్రారంభమైనట్లే. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతాం.
కాంగ్రెస్ పార్టీ లీడర్లకు పిచ్చి పట్టింది. రైతులతో రాజకీయం చేయాలని చూ స్తున్నారు. మళ్లీ రెవెన్యూలో పాత పద్ధతిని ప్రవేశపెట్టి మమ్ములను అధికారులకు బానిసలను చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతమున్న ధరణి పోర్టల్‌తో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్లైన్లోనే అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. కాంగ్రెస్ చేతనైతే రైతులకు ఉపయోగపడే పనులు చేయాలి. లేదంటే మానుకోవాలి. కానీ పిచ్చిపిచ్చి పథకాలు తీసుకవస్తామంటే తగిన గుణపాఠం చెబుతాం.
ఇప్పుడు ఈ ధరణి సిస్టమ్‌తో మాకు వీఆర్వోల చుట్టూ తిరిగే బాధ తప్పింది. మళ్ల కాంగ్రెసోళ్లు పాత పద్ధతినే తీసుకు వస్తే వీఆర్వోలు, పెద్దసార్లను అయ్యా బాంచన్ అని బతిమిలాడాల్సి వస్తుంది. ఇప్పుడు మీ సేవలకు పోతే ఆన్లైన్లోనే అంతా పనులన్నీ అయిపోతున్నాయి. మళ్లీ పాత పద్ధతి తీసుకవస్తే పరేషాన్ తప్పదు. ఈ పద్ధతిని తీసుకరావద్దని కోరుకుంటున్నాం.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేసి భూమాత పోర్టల్‌ను ప్రవేశపెట్టి పాత పట్వారీ వ్యవస్థను తీసుకువస్తామని మాట్లాడడం బాధాకరం. రాజకీయం కోసం కాంగ్రెస్ ఏమి మాట్లాడుతుందో అర్థం కావడం లేదు. ధరణి పోర్టల్‌తో రైతులకు ఎంతో సౌకర్యవంతంగా మారింది. అలాంటి విధానాన్ని రద్దు చేస్తామనడం బాధాకరం. ఇలాంటి చర్యలు చూస్తే కాంగ్రెస్‌కు మతి భ్రమించిదేమోనని రైతులకు సందేహం వస్తుంది.
సిరికొండ : కాంగ్రెస్ పార్టీ భూమా త పోర్టల్ తెచ్చి రికార్డుల్లో కౌలుదారు/అనుభవదారు కాలం పెట్టడంతో రైతులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దీంతో సమ యం వృథాతో పాటు ఆర్థికంగా నష్టం జరుగుతుంది. పాత కాలంలాగా పట్వారీలు ఉంటే వాళ్లు డబ్బులు తీసుకొని పని చేయకుండా తిప్పుతారు. ధరణి వచ్చాక మాకు ఎంతో మేలు జరిగింది. స్లాట్‌బుక్ చేసుకున్నాక తెల్లారి 30 నిమిషాల్లో పట్టా మా పేరుపై మారుతున్నది. కాంగ్రెస్ వాళ్లకు రైతుల కష్టాలు తెల్వదు.
కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో ఏదేదో మాట్లాడుతున్నదే తప్ప ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, భూమాత పోర్టల్‌ను కొత్తగా తెచ్చేది లేదు. ప్రస్తుతమున్న ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలకు ఆస్కారం లేకుండా పోయింది. పాత పద్ధతిలో వీఆర్వోలు ఆడిందే ఆట, పాడిందే పాటగా ఉండేది. ఇప్పుడు ధరణి పోర్టల్ ద్వారా అంతా ఆన్లైన్ చేయడంతో రైతు బయోమెట్రిక్ ద్వారానే చేర్పులు, మార్పులు చేయగలుగుతున్నాం. ఇలాంటి తుగ్లక్ చర్యలు మానుకోకపోతే వచ్చే ఎన్నికల్లో రైతులం కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పి తీరుతాం.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ పాత పద్ధతి తీసుకువస్తామంటున్నది. మాకు పాత పద్ధతి వద్దు. కాంగ్రెస్ పార్టీ కూడా మాకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. పాత రెవెన్యూ ప ద్ధతి మళ్లీ తిరిగి రాదని మాకు తె లుసు. ప్రజలకు మేలు చేసే పథకాన్ని మారుస్తామనడం కాంగ్రెసోళ్ల ప్రజావ్యతిరేక విధానాలకు నిదర్శనం. రైతులకు మేలు చేసే పథకాన్ని మారుస్తామంటే తగిన బుద్ధి చె బుతాం. రైతులకు మేలు చేస్తున్న ధరణి పోర్టల్‌నే కొనసాగించాలనుకుంటున్నాం కాబట్టి బీఆర్ఎస్కే ఓటు వేస్తాం.