రైతులకు అండగా ఉంటాం..
ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసే రైతులకు అండగా ఉంటామని, వారికి కష్టం వస్తే వారితో కలిసి ఆందోళనలో పాల్గొంటామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గురువారం ఆయన సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి, ధర్మారావ్ పేట, ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ గ్రామంలో పర్యటించారు.
- రెండురోజుల్లో ధాన్యం తరలించకపోతే ఆందోళన చేపడుతాం..
- ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి (సదాశివనగర్)/ ఎల్లారెడ్డి, మే 28: ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసే రైతులకు అండగా ఉంటామని, వారికి కష్టం వస్తే వారితో కలిసి ఆందోళనలో పాల్గొంటామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గురువారం ఆయన సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి, ధర్మారావ్ పేట, ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ గ్రామంలో పర్యటించారు. అడ్లూర్ ఎల్లారెడ్డి, ధర్మారావ్ పేట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. స్థానిక రైతులు లారీల సమస్యను వివరించారు.
అనంతరం జాజాల మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు కష్టాలు వస్తున్నాయని మండిపడ్డారు. ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం నెలకొనడంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతున్నదన్నారు. అకాల వర్షాలతో వడ్లు తడిసిపోతున్నాయని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంటనే తరలించాలని, ఈ విషయమై కలెక్టర్తో మాట్లాడుతానని అన్నారు. రెండు రోజుల్లో ధాన్యాన్ని పూర్తిగా తరలించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. జాజాల వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

