ఇందల్వాయి/ మోపాల్ (ఖలీల్వాడి), డిసెంబర్ 22 : మండలంలోని చంద్రాయన్పల్లి గ్రామం వద్ద ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ నాయకులు గురువారం ఘన స్వాగతం పలికి సన్మానించారు. జిల్లాలోని పలు కార్యక్రమాలకు పాల్గొనేందుకు వెళ్లిన కవితకు ఎంపీపీ రమేశ్ నాయక్ ఆధ్వర్యంలో స్వాగతం పలికి సన్మానించారు. గ్రామంలో సబ్స్టేషన్ నిర్మాణం కోసం నిధుల మంజూరుకు సహకరించిన ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లలితా గంగాదాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అరటి రఘు, అంబర్సింగ్, శ్రీధర్, కిషన్, నరేశ్, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
మోపాల్ మండల సొసైటీ చైర్మన్ ఉమాపతిరావు ఆధ్వర్యంలో నాయకులు నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసరావు, ముత్యంరెడ్డి, కంజర భూమయ్య, సాయిరెడ్డి, రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.