BRS | శక్కర్ నగర్ : వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి లో ఈనెల 21న నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు సుమారు 500 మందితో తరలి వెళ్తున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ తెలిపారు. పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని 38 వార్డుల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆయా వార్డుల ఇంచార్జ్ నాయకుల ఆధ్వర్యంలో 40 వాహనాల్లో ఉదయం 9 గంటలకు బోధన్ నుంచి బయలుదేరుతామని ఆయన వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు బోధన్ మాజీ శాసనసభ్యులు మొహమ్మద్ షకీల్ అమీర్ సూచన మేరకు భారీ సంఖ్యలో సభకు తరలి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. బోధన్ పట్టణ శివారులోని ఆచంపల్లి నుంచి వాహనాలు 9 గంటలకు బయలుదేరుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి బోధన్ పట్టణంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు తరలిరావాలని రవీందర్ యాదవ్ కోరారు.